దశాబ్ద కాలంగా యూనివర్శిల్ స్టార్( Universal Star ) వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నాడు.అలాంటి సమయలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో చేసిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
హీరోగా కమల్ హాసన్ కు అతి పెద్ద విజయాన్ని ఆ సినిమా తెచ్చి పెట్టింది అనే విషయం తెల్సిందే.హీరోగా కమల్ హాసన్ మళ్లీ మునుపటి ఉత్సాహం పొందే విధంగా విక్రమ్ సినిమా( Vikram Movie ) నిలిచింది అనడంలో సందేహం లేదు.
హీరోగా విక్రమ్ సినిమా ఇచ్చిన బూస్ట్ తో కమల్ హాసన్ చేస్తున్న సినిమాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం.కేవలం విక్రమ్ సినిమా సక్సెస్ అవ్వడం వల్ల ఆయన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

విక్రమ్ సినిమా సూపర్ హిట్ అవ్వడం వల్లే ఇండియన్ 2 సినిమా( Indian 2 Movie ) ఆగిపోయింది కాస్త మళ్లీ మొదలు అయ్యింది.అంతే కాకుండా ప్రస్తుతం కమల్ చేస్తున్న ప్రాజెక్ట్ లు వందల కోట్ల వసూళ్లు చేస్తాయి అనే నమ్మకంతో భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు.మొత్తానికి ఒక్క హిట్ తో కమల్ హాసన్( Kamal Haasan ) వందల కోట్ల ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు.విక్రమ్ సినిమా దాదాపుగా అయిదు వందల కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే.
ఇండస్ట్రీ హిట్ గా.పాన్ ఇండియా హిట్ గా నిలిచిన విక్రమ్ సినిమా తర్వాత కమల్ హాసన్ చేయబోతున్న సినిమాల బడ్జెట్ లు భారీగా ఉన్నాయి.అంతే కాకుండా ఆయన పారితోషికం కూడా భారీగా పెరిగింది.

ప్రస్తుతం కమల్ చేస్తున్న సినిమా ల విలువ దాదాపుగా అయిదు వందల కోట్లు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.హీరోగానే కాకుండా ఒక వైపు స్పెషల్ గెస్ట్ గా… మరియు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.ఈ నేపథ్యం లో యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ యొక్క హంగామా మామూలుగా లేదు.
ఓ రేంజ్ లో కమల్ రేంజ్ ఉంది అనడానికి తాజాగా ఒక తెలుగు సినిమా లో ఈయన గెస్ట్ గా నటించడం కు గాను ఏకంగా 25 కోట్లు వసూళ్లు చేస్తున్నాడట.