దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆసిన్( Asin ) ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి అనంతరం బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె 2016 వ సంవత్సరంలో మైక్రోమ్యాక్స్ కంపెనీ సీఈఓ రాహుల్ శర్మ( Rahul Sharma ) అనే వ్యక్తిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉన్నారు.వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఆసిన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆసిన్ తన భర్తకు విడాకులు( Divorce ) ఇవ్వబోతున్నారు అంటూ ఓ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.అయితే గతంలో కూడా ఆసిఫ్ తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈమె తన భర్తతో చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేసి ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టారు.అయితే తాజాగా ఈమె విడాకుల గురించి మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే ఇప్పటికే ఆసిన్ తన భర్తకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.ఇలా వీరిద్దరి విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
ఆసిన్ భర్త రాహుల్ శర్మ గత కొంతకాలంగా మరొక అమ్మాయితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని ఈ విషయం తెలిసినటువంటి ఆసిన్ ఇదివరకే తన భర్తకు రెండు మూడు సార్లు హెచ్చరికలు కూడా చేశారని తెలుస్తుంది.ఇలా తన భర్తకు ఆసిన్ హెచ్చరించినప్పటికీ ఆయనలో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆమె తనకు కూతురు ఉన్నా సరే తన భర్త నుంచి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఆసిన్ విడాకుల గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో స్పష్టత రావాలి అంటే ఈ వార్తలపై ఆసిన్ స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.