స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) గత మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాపులుగా నిలిచాయి.ప్రతి హీరోకు ఫ్లాపులు సాధారణం అయినా ఈ మూడు సినిమాలు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.
అయితే ఈ మూడు సినిమాల ఫలితాల విషయంలో ప్రభాస్ తప్పు ఏ మాత్రం లేదు.ప్రభాస్ తన పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
అయితే ఈ సినిమాలు ఇలాంటి ఫలితాలను అందుకోవడానికి దర్శకుల ఎంపికలో పొరపాట్లు, భారీ బడ్జెట్లు కారణమని చెప్పవచ్చు.
ఈశ్వర్ సినిమా నుంచి మిర్చి సినిమా వరకు ప్రభాస్ కెరీర్ లో భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలు ఎక్కువగా లేవు.
అయితే గత కొన్నేళ్లుగా ప్రభాస్ పెద్దగా అనుభవం లేని దర్శకులకు అవకాశాలను ఇస్తూ కెరీర్ పరంగా పొరపాట్లు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆదిపురుష్ పై( Adipurush ) వస్తున్న విమర్శలు చూస్తుంటే ప్రభాస్ అభిమానులు సైతం ఎంతగానో ఫీలవుతున్నారు.

సలార్ ( Salaar ) సినిమాతోనే మళ్లీ తమ ఆశలు తీరతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ తన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిన ప్రభాస్ కథ, కథనం విషయంలో విమర్శలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.తన సినిమాలలో తెలుగు నటీనటులు నటించేలా జాగ్రత్త పడితే ప్రభాస్ కెరీర్ కు మేలు జరిగే ఛాన్స్ అయితే ఉంది.

మరోవైపు ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుండగా ఓం రౌత్ సోషల్ మీడియా వేదికగా జై శ్రీరామ్ అని ట్వీట్ చేశారు.ఆంజనేయస్వామికి రిజర్వ్ చేసిన సీట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ డివినిటీ ఇన్ ఆల్ ఇండియన్ థియేటర్స్ అని ఓం రౌత్ పేర్కొన్నారు.సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.