Yash : సలార్ లో యష్ అలాంటి పాత్రలో నటిస్తున్నాడా.. ఇందులో నిజమెంత?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Update On Salaar And Rocky Bhai Link-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Telugu Salaar, Jagapathi Babu, Kollywood, Prabhas, Prasnth Neel, Rocky Bhai, Tol

కాగా తాజాగా విడుదల అయిన ఆది పురుష్ సినిమా కూడా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఇకపోతే డార్లింగ్ అభిమానులు ప్రస్తుతం అంచనాలు అన్నీ కూడా సలార్ (salaar )సినిమాపై పెట్టుకున్నారు.సలార్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో విలన్స్ గా జగపతిబాబు( Jagapathi Babu ) మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.

Telugu Salaar, Jagapathi Babu, Kollywood, Prabhas, Prasnth Neel, Rocky Bhai, Tol

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కేజిఎఫ్ హీరో యష్ నటిస్తున్నారు అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ వార్తలు నిజమే అని తెలుస్తోంది.ఈ సినిమాలో రాఖీ భాయ్ కనిపించనున్నాడని ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ తో మాట్లాడినట్లు వాయిస్ ని వినిపించనున్నారు అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఒకవేళ అదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం అని చెప్పవచ్చు.కాగా సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఇలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube