తెలంగాణ అటవీశాఖ (Telangana forest department )రీల్స్ చేసేవారికి గుడ్ న్యూస్ తెలిపింది.తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన హారితహరం కార్యక్రమంతో పాటు పచ్చదనం, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, చెట్ల ప్రాముఖ్యతను తెలిపేలా రీల్స్ చేస్తే ప్రతిభను బట్టి రివార్డు అందించనున్నారు.మీరు చేసిన రీల్స్ నచ్చితే బహుమతి ఇవ్వనున్నారు.
తెలంగాణ అటవీశాఖ తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన చేసింది.
తెలంగాణ అవతరణ దశాబ్ది( Telangana decade celebrations ) ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం అనే కార్యక్రమాన్ని అటవీశాఖ చేపడుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా హారితహారం కార్యక్రమం, చెట్ల ప్రాముఖ్యత, అర్బన్ ఫారెస్టుల ప్రాముఖ్యతను అందరికీ తెలిపేందుకు సోషల్ మీడియాను వినియోగించుకుంటోంది.ఇందులో భాగంగా రీల్స్ చేసేవారికి మంచి అవకాశం కల్పిస్తోంది.
వీటిపైన మంచి రీల్స్ చేసి పంపాలని, వాటిల్లో మంచి రీల్‌ను సెలక్ట్ చేసి బహుమతులు ఇస్తామని స్పష్టం చేసింది.ఉత్తమంగా ఉన్న వీడియోలను కూడా సెలక్ట్ చేసి అవార్డులు ఇస్తామని తెలిపింది.
తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటనున్నారు.ఈ సందర్భంగా హారితహరం, చెట్ల ప్రాముఖ్యతను తెలిపేలా ఒక నిమిషం ఉండేలా రీల్ చేయాలని అటవీశాఖ సూచించింది.మీ రీల్స్‌ను [email protected]కి పంపాలని సూచించింది.
ఇక హారితోత్సవం కార్యక్రమంలో భాగంగా జూపార్కులు, జాతీయ పార్కులు, పట్టణ అటవీ ఉద్యానవనాల్లోకి జూన్ 19న ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది.అలాగే పిల్లల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
అలాగే సాగునీటి శాఖ ఆధ్వర్యంలో ఉండే భూముల్లో ప్రత్యేక హారితోత్సవం కార్యక్రమాలు నిర్వహించాలని అటీవీశాఖ నిర్ణయించింది.