మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం చేస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.ఆగస్టు నెలలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
భారీ ఎత్తున సినిమా ను దర్శకుడు మెహర్ రమేష్ రూపొందించాడు.ఆ సినిమా యొక్క విడుదల హడావుడి మొదలు అయిన వెంటనే చిరు తదుపరి సినిమా బ్రో డాడీ యొక్క రీమేక్ మొదలు కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
మలయాళం లో సూపర్ హిట్ అయిన బ్రో డాడీ సినిమా( Bro Daddy ) లో చిరంజీవి తండ్రి పాత్ర లో నటించబోతున్నాడు.
సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) ఈ సినిమా లో చిరంజీవికి కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కు సోగ్గాడే చిన్ని నాయన సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ( Director Kalyan Krishna ) ను దర్శకుడిగా ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.కానీ రీమేక్ లకు అతడు ఎంత వరకు కరెక్ట్ అనేది అనుమానంగా ఉందట.
అందుకే ఆయన పేరు పరిశీలిస్తూనే మరో వైపు మరి కొందరి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.దర్శకుడి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేది ప్రముఖంగా వినిపిస్తున్న మాట.
ఇక ఈ సినిమా ను చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత కొణిదెల( Sushmita Konidela ) నిర్మిస్తున్నారు.భారీ బడ్జెట్ తో చిరంజీవి.సిద్దు జొన్నలగడ్డ సినిమాను నిర్మించబోతున్నారు.బ్రో డాడీ ఒక విభిన్నమైన కాన్సెప్ట్.కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో పాటు మంచి పాయింట్స్ ను దర్శకుడు టచ్ చేయడం జరిగింది.అందుకే చిరు ఈ సినిమా ను చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
సిద్దు కూడా ఓకే చెప్పాడు.నాలుగు కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ రీమేక్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత సుస్మిత కోరుకుంటున్నారు.