నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
అయితే బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక ఘటన మరువక ముందో నిన్న రాత్రి మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.అర్ధరాత్రి సమయంలో హాస్టల్ భవనంపై నుంచి లిఖిత అనే విద్యార్థిని దూకింది.
అయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన లిఖిత ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడిందని సిబ్బంది చెబుతున్నారు.మరోవైపు వరుస సంఘటనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమాచారం అందుకున్న వీసీ నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో లిఖిత మృతదేహాన్ని పరిశీలించారు.అనంతరం మరణంపై అధికారుల వద్ద ఆరా తీశారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.