చిరంజీవి సినిమాకు శ్రీలీల రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా!

మెగాస్టార్‌ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం చేస్తున్న భోళా శంకర్ సినిమా( Bhola Shankar movie ) షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

 Sreeleela Remuneration For Chiranjeevi And Kalyan Krishna Movie Details, Telugu-TeluguStop.com

భోళా శంకర్‌ సినిమా కు మెహర్‌ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆ సినిమా తర్వాత వెంటనే చిరంజీవి చేయబోతున్న సినిమా కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

సోగ్గాడే చిన్ని నాయన సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం లో చిరంజీవి సినిమా ప్రారంభం కాబోతుంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Chiru, Kalyan Krishna, Sreeleela, Sreeleela V

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి,కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో( Chiranjeevi and Kalyan Krishna new movie ) రూపొందబోతున్న సినిమా లో మరో హీరోగా సిద్దు జొన్నలగడ్డ కనిపించబోతున్నాడు.చిరంజీవికి కొడుకు పాత్రలో సిద్దు జొన్నలగడ్డ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.చిరంజీవికి జోడీగా త్రిష నటించబోతుండగా… సిద్దు జొన్నలగడ్డ కు జోడీగా శ్రీ లీలా నటించబోతున్నట్లుగా( Sri Leela paired with Siddu Jonnalagadda ) సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా లో నటించేందుకు గాను శ్రీలీల ఏకంగా 1.50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Chiru, Kalyan Krishna, Sreeleela, Sreeleela V

ఈ సినిమా ను చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మించబోతుంది.భారీ బడ్జెట్‌ తో తండ్రి హీరోగా ఈ సినిమా రూపొందించబోతున్న నేపథ్యం లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఆగస్టు లో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.చిరంజీవి సినిమా లో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం.అలాంటిది ఏకంగా శ్రీ లీల కి ఆయన కోడలిగా నటించే అవకాశం దక్కింది.పైగా కోటిన్నర పారితోషికం అందుకోబోతుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమా లు చాలానే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube