చిరంజీవి సినిమాకు శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం చేస్తున్న భోళా శంకర్ సినిమా( Bhola Shankar Movie ) షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.
ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భోళా శంకర్ సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆ సినిమా తర్వాత వెంటనే చిరంజీవి చేయబోతున్న సినిమా కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
సోగ్గాడే చిన్ని నాయన సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో చిరంజీవి సినిమా ప్రారంభం కాబోతుంది.
"""/" /
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి,కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో( Chiranjeevi And Kalyan Krishna New Movie ) రూపొందబోతున్న సినిమా లో మరో హీరోగా సిద్దు జొన్నలగడ్డ కనిపించబోతున్నాడు.
చిరంజీవికి కొడుకు పాత్రలో సిద్దు జొన్నలగడ్డ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.చిరంజీవికి జోడీగా త్రిష నటించబోతుండగా.
సిద్దు జొన్నలగడ్డ కు జోడీగా శ్రీ లీలా నటించబోతున్నట్లుగా( Sri Leela Paired With Siddu Jonnalagadda ) సమాచారం అందుతోంది.
భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా లో నటించేందుకు గాను శ్రీలీల ఏకంగా 1.
50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. """/" /
ఈ సినిమా ను చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మించబోతుంది.
భారీ బడ్జెట్ తో తండ్రి హీరోగా ఈ సినిమా రూపొందించబోతున్న నేపథ్యం లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఆగస్టు లో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.చిరంజీవి సినిమా లో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం.
అలాంటిది ఏకంగా శ్రీ లీల కి ఆయన కోడలిగా నటించే అవకాశం దక్కింది.
పైగా కోటిన్నర పారితోషికం అందుకోబోతుంది.ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమా లు చాలానే ఉన్నాయి.
బాలయ్య కంటే చిరంజీవి కే ఎక్కువ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్… కారణం ఏంటంటే..?