Jabardasth Show: ఆ కమెడియన్లకు మళ్లీ జబర్దస్త్ షో దిక్కైందా.. దారులు వెతుక్కుంటూ వస్తున్నారంటూ?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ కామెడీ షో( Jabardasth Show ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కొన్ని ఏళ్లుగా ప్రసారం నవ్వుతూ వెళ్ళు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్వించడంతోపాటుగా ఎంతోమందికి జబర్దస్త్ లైఫ్ ని ఇచ్చింది.

 Jabardath Comedian Sunami Sudhakar Re Entry On Jabardasth Show-TeluguStop.com

ఎంతోమంది కమెడియన్లు సినిమా ఇండస్ట్రీకి జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే.సుడిగాలి సుదీర్, షకలక శంకర్, వేణు, గెటప్ శీను, రాంప్రసాద్, ధనరాజ్, ఇలా ఎంతోమంది కమెడియన్లు జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవడం తోపాటు వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మెప్పించారు.

Telugu Bullet Bhaskar, Sudhakar, Getup Srinu, Jabardasth, Sunami Sudhakar, Tolly

ఇలా ఉంటే ఇటీవల కాలంలో చాలా మంది కమెడియన్లు జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోయి ఇతర షోలలో చేయడంతో పాటు వెండితెరపై అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.అలా చాలామంది కమెడియన్లు జబర్దస్త్ ను వదిలి వెళ్లి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరుగా మళ్లీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.వేణు, శ్రీను, ధనరాజ్ షకలక శంకర్ లు జబర్దస్త్ ని వదిలేసి సినిమాల్లో బిజీ అయ్యారు.

అందులో వేణు, ధనరాజ్ క్లిక్ అవ్వగా షకలక శంకర్( Shakalaka Shankar ) రీసెంట్ గా బుల్లెట్ భాస్కర్ స్కిట్ తో జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.అలాగే సుడిగాలి సుదీర్ శీను ఆదిలో సినిమాలలో నటించి సెట్ కాకపోవడంతో మళ్లీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చారు.

Telugu Bullet Bhaskar, Sudhakar, Getup Srinu, Jabardasth, Sunami Sudhakar, Tolly

ఆ మధ్య సునామి సుధాకర్( Sunami Sudhakar ) జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా సుధాకర్ జబర్దస్త్ లోకి నూకరాజు స్కిట్ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు.కాగా మొన్నటికి మొన్న బుల్లెట్ భాస్కర్ స్కిట్ తో షకలక శంకర్ రీ ఎంట్రీ ఇవ్వగా ఈ వారం సుధాకర్ రీ ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఈ గ్యాప్ లో కనీసం యూట్యూబ్ ఛానల్ అన్నా పెట్టుకుపోయావా అన్నా అని అడిగి అతన్ని సరదాగా ఆటపట్టించారు నూకారాజు టీం సభ్యులు.

పంచ్ ప్రసాద్ సుధాకర్ ని మరిచిపోయామంటూ వేసిన జోక్ బాగా పేలింది.అలా జబర్దస్త్ షో ను వదిలి వెళ్ళిపోయిన కమెడియన్లకు మళ్లీ జబర్దస్త్ ఆధారం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube