ప్రేమ కథ చిత్రాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ తేజ ( Director Teja ) మార్క్ సపరేటుగా ఉంటుందని చెప్పాలి.డైరెక్టర్ తేజ ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఎంతో మంది హీరోలను హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ ( Abhi Ram ) ను ఈయన హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అహింస( Ahimsa ) .ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే తేజ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సినిమాని ప్రమోషన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి తేజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కుమారుడు సినీ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.సాధారణంగా ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం ఇప్పటికే ఎంతోమంది ఇలా వారసత్వంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ తేజ ఆయన కుమారుడు డైరెక్టర్ గా కాకుండా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారట.
ఈ క్రమంలోనే తేజ తన కుమారుడి( Teja Son ) ఎంట్రీ గురించి మాట్లాడుతూ… తన కొడుకుకి సినిమాలపై చాలా ఆసక్తి ఉందని ఈ ఆసక్తితోనే తాను హీరో అవ్వాలని విదేశాలలో అందుకు సంబంధించిన కోర్సులను కూడా పూర్తి చేసి వచ్చాడని తేజ తెలియజేశారు.ఇక చూడటానికి మా అబ్బాయి చాలా హ్యాండ్సమ్( Handsome ) గా కూడా ఉంటారు.అయితే హీరో అవ్వడానికి అందం ఒక్కటే సరిపోదు కదా అంటూ తేజ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇక తన కుమారుడు హీరోగా పరిచయమైన తనని ఇండస్ట్రీకి నేను పరిచయం చేయాలా లేక ఆ బాధ్యత మరొకరికి ఇవ్వాలా అన్న ఆలోచనలో కూడా తాను ఉన్నానని ఈ సందర్భంగా కొడుకు ఎంట్రీ గురించి తేజ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.