వైరల్: లతా మంగేష్కర్ పాటకు వృద్ధుల లిప్ సింక్ చూడండి, మతిపోతుంది!

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ నెటిజన్లను ఖుషి చేస్తూ ఉంటుంది.అయితే తాజాగా ఓ వైరల్ వీడియో మాత్రం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు.

 Elderly Couple Lip-syncing Lata Mangeshkar Zindagi Ki Na Toote Ladi Song Video V-TeluguStop.com

ప్రస్తుతం ఆ వీడియో రెండు మిలియన్ వ్యూస్ దాటిపోటు దూసుకుపోతోంది.ఇంతకీ అంతగా వైరల్ అవ్వడానికి ఆ వీడియోలో ఏముంది అనే అనుమానం మీకు కలుగుతోంది కదూ.ఓ పెద్దవయసు జంట చక్కటి డ్యూయెట్ కు లిప్ సింక్( Lip Sync ) చేసి ఓ రీల్ చేశారు.అందులో వాళ్ల ఎక్స్ ప్రెషన్స్.

పాటకు వాళ్లిచ్చిన లిప్ సింక్ ఇపుడు అందరినీ అవాక్కయేలా చేస్తోంది.

అవును, రీల్స్. అనేవి సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.తమలోని టాలెంట్ ను ఏదో రకంగా లోకానికి తెలియజేయడానికి చాలామంది రీల్స్ ను ఇపుడు ఆశ్రయిస్తున్నారు.

ఇందులో కపుల్ రీల్స్ ( Couple Reels ) మాత్రం చాలా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి.ఇక్క భార్య భర్తలిద్దరికీ ఒకే అభిరుచి ఉండి రీల్స్ చేయడం గొప్ప అనుభూతి అని చెప్పుకోవచ్చు.

అందులే అది నెటిజన్ల మనసును దోచుకుంటుంది.వారు తీసుకున్న పాట కూడా పాత బాలీవుడ్ సినిమా క్రాంతిలో లతా మంగేష్కర్( Lata Mangeshkar ) పాడిన డ్యూయెట్ కావడం విశేషం.

కాగా ఈ వీడియోను నందా చౌహాన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయగా వెలుగు చూసింది.అందులో ఓ పెద్దాయన కూర్చుని ఉండగా.భార్య అతడిని ఉత్సాహపరుస్తూ పాట పల్లవి అందుకుంటుంది.దీనికి అతను కూడా చక్కగా లిప్ సింక్ చేయడం కొసమెరుపు.ఆ రీల్ చూస్తే వారి అనుబంధం అద్దం పడుతుంది.అతడిని భార్య ఉత్సాహపరుస్తూ.

చేతి కదలికలు చేయడానికి సహాయం చేస్తుంది.లతా మంగేష్కర్, నితిన్ ముఖేష్ పాడిన ‘జిందగీ కి నా టూటే లడి’ అనే పాటకు లిప్-సింక్ చేస్తున్నప్పుడు ఇద్దరూ చాలా నవ్వుతూ కనిపిస్తారు.

కాగా ఈ జంటపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube