సోషల్ మీడియాలో( Social Media ) ఆగ్రహాన్ని రేకెత్తించే ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు బతికి ఉన్న నెమలి ( Peacock ) నుంచి ఈకలను క్రూరంగా పీకేశాడు.
అలా పీకేస్తుంటే ఆ పక్షి బాధ తట్టుకోలేక అల్లాడిపోయింది.చివరికి ఆ నెమలి కన్ను మూసింది.
మధ్యప్రదేశ్‌లోని( Madhya Pradesh ) కట్ని జిల్లాలో ఈ ఘోరం జరిగిందని అధికారులు ఆదివారం ప్రకటించారు.
ఈ ఘోరానికి పాల్పడ్డ వ్యక్తిని అతుల్‌గా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
వైరల్ వీడియోలో, ఒక ఫ్రెండ్ చూస్తున్నప్పుడు ఈ యువకుడు నెమలి ఈకలను అత్యంత నిర్దాక్షిణ్యంగా తీయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాట రావడం వినవచ్చు.ఈ దృశ్యాలను చూస్తుంటేనే ఎంతో బాధేసింది.
ఆ యువకుడు తానేదో ఘనకార్యం చేస్తున్నట్లు ఈ ఘోరాన్ని వీడియో రికార్డ్ చేశాడు.అనంతరం దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అది కాస్త వైరల్ అయింది.చివరికి అధికారుల దృష్టికి వచ్చింది.
ఈ వీడియో ఫుటేజీలో కనిపించిన బైక్ నంబర్‌ను విశ్లేషించడం ద్వారా నిందితుడిని గుర్తించగలిగామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) గౌరవ్ శర్మ వెల్లడించారు.జిల్లాలోని రీతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ బైక్‌ను గుర్తించారు.అయితే, అతుల్ నివాసానికి చేరుకున్న పోలీసు బృందం అతను అక్కడ లేడని గుర్తించింది.నిందితుడిని వెంటనే గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డీఎఫ్‌వో హామీ ఇచ్చారు.
సంఘటన, ప్రమేయం ఉన్న వ్యక్తుల గురించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు ప్రస్తుతం తదుపరి పరిశోధనలు జరుగుతున్నాయి.నెమలి మన జాతీయ పక్షి. అంతేకాకుండా రక్షిత జాతికి చెందినది.అలాంటి నెమలిపై జరిగిన నేరం తీవ్రతను గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.