కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ బిజెపి నాయకులపై భారీ ప్రభావం చూపించినట్లు ఉన్నాయి.కేంద్రం నుంచి పిలుపు వచ్చిందో లేక ఈ నాయకులలో కదిలికి వచ్చిందో తెలియదు గానీ వరుస పెట్టి ఢిల్లీలో పెడుతున్న మీటింగ్ లు తెలంగాణా బాజాపా ను వార్తల్లో నిలుపుతున్నాయి.
చేరికలు కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ ని ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టానం రాష్ట్రంలో భాజపా పరిస్థితి పై పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకున్నట్టు సమాచారం.తెలంగాణలో అధికారం వచ్చే స్థాయిలో ప్రస్తుతం పరిస్థితులు లేవని ,నాయకులు మధ్యన కూడా సమన్వయం లోపించిందని పరిస్థితులను చక్కదిద్దుకోకపోతే పార్టీ ఆశించిన ప్రయోజనాలను తెలంగాణలో పొందడం కష్టమవుతుందని ఈటెల రాజేందర్ నివేదిక ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా తెలంగాణలో బండి సంజయ్ వ్యవహార శైలిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని నాయకులను కలుపుకొని పోవడంలో బండి వెనుక పడ్డారని కూడా ఆయన తేల్చి చెప్పేసారని ఒక వర్గం మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది .
కెసిఆర్ ను డీ కొట్టాలంటే మరింత బలపడాల్సిన అవసరం ఉందని భావిస్తున్న భాజపా అందుకు తీసుకోవలసిన అంశాలపై చర్చించడానికి టీ భాజపానేతలను ఢిల్లీకి పిలిపించినట్లుగా తెలుస్తుంది తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) గత రెండు రోజుల్లోగా ఢిల్లీలోనే తిష్ట వేసి కీలక నేతలను కలుస్తున్నట్లుగా తెలుస్తుంది కొండా విశ్వేశ్వర్ రెడ్డిని( Konda Vishweshwar Reddy ) కూడా ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టానం ఆయనతో కూడా చర్చలు జరుపుతుంది .మరి పార్టీని గెలిపించడానికి అధికార మార్పిడి చేస్తుందా? లేక నాయకులు మధ్యన విబేదాలను సరిచేసి వీళ్ళందర్నీసంగటితo చేసే ప్రయత్నం చేస్తుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది.
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ మానసికంగా బలంగా తయారైంది … అధికారం మీద ఆశతో తమ మద్య ఉన్న విభేదాలను కూడా పక్కనపెట్టి ఆ పార్టీ నేతలు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇంత కాలం కేసీఆర్ వర్సెస్ బిజెపిగా ఉన్న సమీకరణo ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్( Congress ) గా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పోటీలో నిలబడకపోతే వచ్చే ఎన్నికలు ముక్కోణపు పోటీకి బదులు రెండు పార్టీల మధ్యన పోటీగా మారే అవకాశం ఉందని కూడా వార్తలో వస్తున్నాయి .ఇప్పటికే దక్షిణాదిలో ప్రాతినిధ్యం కోల్పోయిన భాజాపా గెలుపు అంచనాలున్న తెలంగాణలో ఏ రకంగా ముందుకు వెళుతుందన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది.