పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో అడవి శేష్ పెళ్లి ఖరారు..జూన్ 16 వ తేదీన ముహూర్తం సిద్ధం

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో కాస్త డిఫరెంట్ సబ్జక్ట్స్ ని ఎంచుకుంటూ తనకంటూ మార్కెట్ లో ఒక ప్రత్యేకమైన ఇమేజి ఏర్పర్చుకున్న హీరో అడవి శేష్.( Adivi Sesh ) ఈయన హీరో గా మారే ముందు చాలా సినిమాల్లో విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టు గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

 Hero Adivi Sesh Supriya Marriage Date Fixed Details, Hero Adivi Sesh, Supriya ,-TeluguStop.com

పవన్ కళ్యాణ్ ‘పంజా’ చిత్రం లో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన అడవి శేష్ ఆ తర్వాత బలుపు , దొంగాట , బాహుబలి వంటి సినిమాల్లో నెగటివ్ రోల్స్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించాడు.ఇక శర్వానంద్ హీరో గా నటించిన ‘రన్ రాజా రన్’ చిత్రం లో సెకండ్ హీరో గా నటించిన అడవి శేష్ , ‘క్షణం’ చిత్రం ద్వారా హీరో గా ఆడియన్స్ ని పలకరించాడు.

ఈ చిత్రం అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి , అడవి శేష్ ని హీరో గా నిలబెట్టింది.

తర్వాత ‘గూడాచారి’, ‘ఎవరు’, ‘అమీ తుమీ’ , ‘మేజర్’ మరియు ‘హిట్ : ది సెకండ్ కేసు’ వంటి చిత్రాల్లో హీరో గా నటించాడు.ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.స్పై థ్రిల్లర్ జానర్ సినిమాకి అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ, ఇప్పుడు అడవి శేష్ అనే రేంజ్ లో ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

ప్రస్తుతం ఆయన గూఢచారి 2 చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.ఇది ఇలా ఉండగా అడవి శేష్ గురించి చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రూమర్ తెగ ప్రచారం అవుతుంది.

అదేమిటి అంటే ఆయన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'( Akkada Ammayi Ekkada Abbayi ) హీరోయిన్ సుప్రియ తో ( Supriya ) గత కొంతకాలం నుండి డేటింగ్ లో ఉన్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.

Telugu Adivi Sesh, Akkadaammayi, Pawan Kalyan, Supriya-Movie

సుప్రియ స్వయానా అక్కినేని నాగేశ్వర రావు గారి మనవరాలు, సుమంత్ కి చెల్లెలు.పవన్ కళ్యాణ్ తో ఆ సినిమా చేసిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.కానీ అన్నపూర్ణ స్టూడియోస్ కార్యకలాపాలు మొత్తం సుప్రియా నే దగ్గరుండి చూసుకుంటుంది.

ఇది ఇలా ఉండగా ఈమె అడవి శేష్ హీరో గా నటించిన ‘గూడాచారి’ అనే చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ సమయం లో ఆమె అడవి శేష్ కి చాలా దగ్గర అయ్యిందట.

Telugu Adivi Sesh, Akkadaammayi, Pawan Kalyan, Supriya-Movie

తక్కువ సమయం లోనే మంచి స్నేహితులై ఆ తర్వాత ప్రేమలో కూడా పడ్డారట.అయితే ఈ వార్తలపై గతం అడవి శేష్ స్పందించి అలాంటిదేమి లేదని కొట్టిపారేసినా, వీళ్ళు తరచూ ప్రైవేట్ పార్టీలకు మరియు పబ్బులకు వెళ్తూ ఉండడం, కలిసి తిరగడం , టూర్స్ కి వెళ్లడం వంటివి సోషల్ మీడియా లో ఫోటోల రూపం లో తిరుగుతూనే ఉన్నాయి.కాబట్టి వీళ్ళు లవర్స్ కాదు అంటే ఎవ్వరూ నమ్మడం లేదు.ఇప్పుడు రీసెంట్ గా ఈ జంట జూన్ 16 వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నాడు అడవి శేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube