కర్ణాటక విజయం కాంగ్రెస్ పార్టీలో జోష్ ని పెంచినట్టుగా తెలుస్తుంది .కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలు అన్నిట్లో ఈ విజయం వారికి నైతిక ధైర్యాన్ని ఇచ్చి విజయం సాధించేందుకు బూస్ట్ ఇచ్చింది .
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘర్ వాపసి పిలుపునిచ్చారు.గతం లో వివిధ వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ లో వదిలిపెట్టి వెళ్లిన పాతకాపులు అందర్నీ తిరిగి పార్టీలోకి రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నారు.
ప్రజల్ని ప్రభావితం చేయగల కీలక నేతల్ని తిరిగి పార్టీలోకి చేర్చే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
కెసిఆర్ ని ఓడించాలనే ఉద్దేశంతో కొందరు, పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే కారణాలతో కొంతమంది పార్టీని విడిచి వెళ్లిపోయినందున కాంగ్రెస్ తెలంగాణలో కొంత బలహీన పడిందని దానిని తిరిగి పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తుంది .కెసిఆర్ వ్యతిరేకులందరికీ( CM KCR ) కాంగ్రెస్ పార్టీ వేదిక అవుతుందని ఆ నేతలందరికీ పునరేకికరణ చేయాలని బావిస్తున్నారు రేవంత్ రెడ్డి.
అయితే కర్ణాటకలో పరిస్థితులు వేరని ,తెలంగాణలో పరిస్థితులు వేరని వర్గపోరు సతమవుతమవుతున్న తెలంగాణలో కాంగ్రెస్ మరొకసారి అధికారులకు వచ్చే అవకాశం తక్కువని భావిస్తున్న నేతలు పార్టీలో చేరడానికి ముందు వెనక ఆడుతున్నారని సమాచారం.తనను పార్టీలోకి రేవంత్ ఆహ్వానించిన మాట నిజమేనని కానీ తాను ఏ విషయాన్ని స్పష్టం చేయలేదని రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ) చెప్పుకొచ్చారు.ఈటెల రాజేందర్ లాంటివారైతే తాము బిజెపిలో సంతృప్తికరంగా ఉన్నామని ఏ పార్టీలో చేరాల్సిన అవసరం లేదని తేల్చేశారు.
మెజారిటీ తగ్గొచ్చేమో కానీ ఈసారి కూడా తెలంగాణలో కేసీఆర్ దే అధికారం అని మెజారిటీ మీడియా వర్గం కూడా భావిస్తుంది .మరి ఎన్నికల ఆరు నెలల లోపే ఉన్నందున ఎంత మంది కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షిస్తుందో చూడాలి.
ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి అధికారం సాధించాలని బలంగా భావిస్తున్న రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మరి ఆ దిశగా ఏ మేరకు విజయం సాధిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.సీనియర్ల నుంచి సహకారం లేకపోయినా పార్టీ ని పార్టీని బలపరచడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి.ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కావాలన్న ఆయన చిరకాల కోరిక నెరవేరుతుందనడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు.