వచ్చే సార్వత్రిక ఎన్నికలు హోరా హోరీ గా ఉంటాయన్న సంకేతాలు ఇప్పటికే వెలుపడ్డాయి.కాంగ్రెస్ పార్టీ క్రమం గా పుంజుకోవడం, విపక్ష పార్టీలు కూడా ఆయా ప్రాంతాల్లో బలంగా ఉండటం ,బాజాపా కు వ్యతిరేకంగా ఐక్యత కూటమి కట్టే ప్రయత్నాల్లో ఉండడంతో ఈసారి సార్వత్రిక ఎన్నికలు బిజెపిvs విపక్ష పార్టీల కూటమిగా ఉండే అవకాశం కనిపిస్తుంది.
బిజెపికి మూడోసారి కూడా ప్రధాని అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటారని భాజపా పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.అందువల్ల విపక్షకూటమికి ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరున్నా సరే తలపడాల్సిందే మోడీతోనే అనే విషయం ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది .
అయితే విపక్షకూటమికి ప్రధాన అభ్యర్థిగా ఎవరుంటారు అన్న ప్రశ్న ఆసక్తి కలిగిస్తుంది ఇప్పుడా ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు.కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్.దేశవ్యాప్త ఇమేజ్ కలిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని డీ కొట్టాలంటే దేశస్థాయిలో ప్రాముఖ్యం కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు .నితీష్ కుమార్ కి గాని మమతా బెనర్జీకి గాని అరవింద్ కేజ్రీవాల్ కి గాని ఆయా ప్రాంతాలలో మాత్రమే పట్టు ఉందని ప్రియాంక గాంధీ అయితే దేశవ్యాప్త ఇమేజ్ కలిగి ఉండటం వల్ల మోదీని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా పేదల మనసుల్లో సుస్థిర సానం సంపాదించుకున్న దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పోలికలతో పాటు ఆమె వాక్చాతుర్యాన్ని సమర్ధతను కూడా అంది పుచ్చుకున్న ప్రియాంక అయితే విజయం సాధించడం సులువు అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.మరోవైపు ఆయన వ్యాఖ్యలపై బిజెపి నుంచి సెటైర్లు పడుతున్నాయి ….తమ ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీకి సమర్ధత లేదని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్లు అయిందని బిజెపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు .విపక్ష కూటములు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరొకసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీని ఎన్నిక అవుతారని దేశానికి సుపరిపాలన అందిస్తారని బాజాపా నేతలు చెబుతున్నారు.