అల్లం సాగులో చీడపీడల నివారణ.. సరైన సస్యరక్షక పద్ధతులు..!

పలు రకాల పంటలలో అంతర పంటగా అల్లం ( Ginger ) అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.తేమతో కూడిన వాతావరణం అల్లం సాగుకు( Ginger Cultivation ) అనుకూలంగా ఉంటుంది.

 Pests Prevention In Ginger Cultivation Details, Pests Prevention ,ginger Cultiva-TeluguStop.com

కానీ నీరు నిలువ ఉండే నేలలు అల్లం సాగుకు పనికిరావు.చీడపీడల బెడదను నివారించాలంటే ఆరోగ్యకరమైన దుంపలను ఎంచుకోవాలి.

విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేయడం తప్పనిసరి.అల్లం సాగుకు ఆశించే చీడపీడలు ( Pests ) ఏంటో.? వాటిని ఎలా గుర్తించి అరికట్టాలో తెలుసుకుందాం.

ఆకుమాడు తెగులు:

నేలను తాకే ఆకులపై ఆకుపచ్చ రంగులో నీటిమచ్చలు ఏర్పడి తరువాత గోధుమ రంగులోకి మారి, ఆకు తొడిమెలకు వ్యాప్తి చెంది ఆకులు మాడిపోతాయి.ఈ తెగుల నివారణకు లీటరు నీటిలో ఒక మిల్లీలీటరు ప్రాపికొనజోల్ కలిపి ఆకులు మొత్తం తడిచేలాగా పిచికారి చేయాలి.

వేరు పురుగు:

ఈ పురుగులు దుంపల మొదళ్ళలో ఉండే వేర్లను కత్తిరిస్తాయి.దీంతో తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ పురుగుల నివారణకు ఐదు కిలోల ఫోరేట్ గుళికలను మొక్కల మొదళ్ళ వద్ద వేసి ఈ పురుగులను నియంత్రించాలి.

Telugu Agriculture, Farmers, Fertilizers, Ginger, Ginger Crop-Latest News - Telu

పోలుసు పురుగు:

ఈ పురుగులు అల్లం విత్తన దుంపలను ఆశించి పూర్తిగా రసాన్ని పీల్చేస్తాయి.కాబట్టి ఈ పురుగుల నివారణకు లీటరు నీటిలో ఐదు మిల్లీలీటర్ల మలాథాయాన్ కలిపి, ఈ ద్రావణంలో 30 నిమిషాలు విత్తన దుంపలను నానబెట్టి ఆ తర్వాత కాస్త ఆరిన వెంటనే పొలంలో విత్తుకోవాలి.

Telugu Agriculture, Farmers, Fertilizers, Ginger, Ginger Crop-Latest News - Telu

మొవ్వు తొలుచు పురుగు:

ఈ పురుగులు అల్లం మొక్క మొవ్వను పూర్తిగా తొలిచేస్తాయి.వీటిని నివారించడంలో ఆలస్యం అయితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.ఈ పురుగుల నివారణకు లీటరు నీటిలో 2మి.లీ డైమిథోయేట్ + 1మి.లీ సాండోవిట్ కలిపి పిచికారి చేయాలి.లేదంటే లీటర్ నీటిలో 2మి.లీ క్వినాల్ ఫాస్ + 1మి.లీ సాండోవిట్ కలిపి మొవ్వు ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube