తాజాగా జరిగిన గూగుల్ లాంచింగ్ ఈవెంట్ ‘గూగుల్ ఐ/ఓ 2023’( Google I/O 2023 )లో కంపెనీ సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసి వినియోగదారులకు మంచి కిక్ ఇచ్చింది.పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ ట్యాబ్, పిక్సెల్ 7a ఫోన్ వంటి డివైజ్‌లను గూగుల్ పరిచయం చేసిన నేపథ్యంలో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఆండ్రాయిడ్ 14’( Android 14 )పై కూడా కీలక ప్రకటన చేయడం విశేషం.
కస్టమైజ్డ్ ఆప్షన్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఈ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త బీటా వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.మొదటి బీటా వెర్షన్ కేవలం పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు సెకండ్ బీటా పార్ట్నర్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఫోల్డబుల్ డివైజ్‌లకు అందుబాటులోకి రావడం గమనార్హం.
ఇకపోతే, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ కోర్ ఫీచర్లలో ఐఓయస్ 16 ( iOS 16 )లాంటి కస్టమైజబుల్ లాక్ స్క్రీన్, ఇంప్రూవ్డ్ కెమెరా ఎక్స్‌పీరియన్స్, ఇంకా యూ యస్ బి ద్వారా లాస్‌లెస్ ఆడియో వంటి ఆప్షన్లు ఎన్నో ఉన్నాయి.ఆండ్రాయిడ్ 14ని మరింత అభివృద్ధి చేయడానికి, ఆప్టిమైజ్ చేయడానికి గూగుల్ కంపెనీ ఐక్యూ, నథింగ్, వన్‌ప్లస్, లెనోవో, ఒప్పో, టెక్నో, రియల్‌మీ, వివో, షియోమి వంటి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఆండ్రాయిడ్ 14 బీటా ప్రోగ్రామ్‌లో శామ్‌సంగ్ లేకపోవడం కొసమెరుపు.ఇదే విషయం పలువురిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది.గూగుల్ పిక్సెల్( Google Pixel ) యూజర్లు ఆండ్రాయిడ్ డెవలపర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆండ్రాయిడ్ 14 బీటాకు యాక్సెస్ పొందవచ్చు.డివైజ్‌లలో బీటా ఓఎస్ వాడేటప్పుడు సాధారణంగా కొన్ని కస్టమైజ్డ్ ఫీచర్లను కోల్పోతారు.
ఇకపోతే గూగుల్ పిక్సెల్ సిరీస్‌లోని పిక్సెల్ 4a (5G), పిక్సెల్ 5, పిక్సెల్ 5a, పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6a, పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7a, పిక్సెల్ ఫోల్డబుల్, పిక్సెల్ ప్యాడ్ డివైజ్‌లలో లేటెస్ట్ బీటా అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.