టాలీవుడ్ హీరోలలో ఒకరైన సాయితేజ్ విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఈ సినిమాతో తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.సాయితేజ్( Sai tej ) కు యాక్సిడెంట్ అయిన సమయంలో ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే తనకు కష్టకాలంలో అండగా ఉన్నవాళ్ల గురించి సాయితేజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తనకు యాక్సిడెంట్ అయిన సమయంలో చాలామంది నుంచి సపోర్ట్ లభించిందని ఆయన చెప్పుకొచ్చారు.నా ప్రొడక్షన్ మేనేజర్లు ఇద్దరు సతీష్ లు యాక్సిడెంట్ సమయంలో నాకు పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించారని సాయితేజ్ చెప్పుకొచ్చారు.వాళ్లిద్దరూ నా కుడి ఎడమ భుజాలుగా నిలిచి సహాయం చేశారని ఆయన కామెంట్లు చేశారు.
నా వ్యక్తిగత డ్రైవర్ నాగికి కూడా చాలా థ్యాంక్స్ అని సాయితేజ్ అన్నారు.నాకు సపోర్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అయన కామెంట్లు చేశారు.
మరోవైపు విరూపాక్ష మూవీ( Virupaksha Movie ) రాబోయే రోజుల్లో వచ్చే కలెక్షన్లతో కలిపి 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సాయితేజ్ కథల ఎంపికలో మారితే మాత్రం మరిన్ని విజయాలు సొంతమవుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సాయితేజ్ కెరీర్ విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వినోదయ సిత్తం రీమేక్( Vinodhaya Sitham Remake ) షూటింగ్ ను కూడా ఆయన వేగంగానే పూర్తి చేసిన సంగతి తెలిసిందే.వినోదాయ సిత్తం రీమేక్ లో పవన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం ఈ సినిమాకు బిజినెస్ విషయంలో ప్లస్ అవుతోంది.పవన్ స్ట్రెయిట్ సినిమాలకు జరుగుతున్న స్థాయిలోనే ఈ సినిమాకు బిజినెస్ జరుగుతోంది.
సాయితేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.