ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కస్టడీ పొడిగింపు అయింది.ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో ఆయనను సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హజరుపరిచారు.
ఈ క్రమంలో మే 12వ తేదీ వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కాగా మనీశ్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 26న సిసోడియాను పోలీసులు అరెస్ట్ చేశారు.