కార్తీక్ వర్మ దండు( Karthik Varma Dandu )… శుక్రవారం రోజు విరూపాక్ష సినిమా విడుదల అయినా రోజు నుంచి అతడి గురించే అందరు మాట్లాడుకుంటున్నారు.ఎవరు ఈ కార్తీక్ వర్మ .
సుకుమార్ శిష్యుడిగా మాత్రమే పరిచయం ఉన్న కార్తీక్ కి ఇలాంటి ఒక సినిమా తీసే గట్స్ రావడానికి గల కారణం ఏంటి అని అంత అతడి గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో వెతుకులాట ప్రారంభించారు.విషయంలోకి వెళ్తే కార్తీక్ వర్మ దండు పుట్టింది పెరిగింది అంత విశాఖ పట్నంలోనే.
పిజి వరకు అక్కడే చదువుకున్న కార్తీక్ కి చిన్నతనం నుంచి సినిమ అంటే విపరీతమైన పిచ్చి ఉంది.
విరూపాక్ష సినిమా కి ముందు భమ్ బోలేనాథ్( Bham Bholenath ) అనే మరొక సినిమాకు దర్హకత్వం వహించాడు.అంతకన్నా ముందు రైటర్ గా పలు సినిమాలకు పని చేసిన అనుభవం ఉంది.కార్తికేయ మొదటి భాగానికి రైటర్ గా ఉన్న కార్తీక్, సాయి ధరమ్ తేజ్ నటించిన జవాన్ సినిమా కో రైటర్ గా పని చేసాడు.
ఇక విరూపాక్ష సినిమా) Virupaksha ) విషయానికి వస్తే ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా కార్తీక్ ఉన్నాడు.హీరో కి ప్రాముఖ్యత లేకపోయినా ఈ సమయంలో అతడికి ఒక సాలిడ్ హిట్ సినిమా కావలి.
ప్రమాదం తర్వాత అతడి కి ఒక హిట్ పడితే తప్ప సాయి ని ఎవరు గుర్తు పెట్టుకోలేని పరిస్థితి.అన్ని అంశాలు చక్కగా కలిసి వచ్చాయి.అందుకే అటు సాయి ధరమ్ తేజ( Sai Dharam Tej ) ఇటు కార్తీక్ వర్మ దండు కి మంచి హిట్ సినిమా దొరికింది.విభిన్నమైన సబ్జెక్టు తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంటుంది.
కార్తీక్ వర్మ కు భమ్ బోలేనాథ్ తో ఉన్న ప్లాప్ టాక్ ఈ సినిమాతో పోయింది.ఇక ఈ సినిమా ను కార్తీక్ తెరకెక్కించిన తీరు కూడా అందరికి బాగా నచ్చింది.ముఖ్యం క్షుద్ర పూజలు వంటి సబ్జెక్టు కి స్క్రీన్ ప్లే తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం.ఈ రెండు విషయాల్లో సరిగ్గా వర్క్ అవుట్ అయ్యింది కాబట్టి విరూపాక్ష గెలిచింది.
ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ వంటివి కూడా బాగున్నాయి.మరి ముఖ్యం గా తన శిష్యుడు తీసిన సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే( Sukumar ) అందించడం నిజంగా ఎంతో పెద్ద విషయం.
తన శిష్యులను బాగా ప్రోత్సహించడం లో ముందు ఉంటారు సుకుమార్.