తేనె( honey ).మధురమైన రుచితో పాటు ఎన్నో విలువైన పోషకాలు కలిగి ఉంటుంది.
అందుకే ఆరోగ్యపరంగా తేనె ఎంతో మేలు చేస్తుంది.అనేక జబ్బులను అడ్డుకుంటుంది.
అలాగే చర్మ సంరక్షణకు సైతం తేనె ఉత్తమంగా సహాయపడుతుంది.అసలు చర్మానికి తేనె తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
చాలా మంది తమ ముఖ చర్మం( facial skin ) పై మొండి మచ్చలు ఉన్నాయని ఎంతగానో సతమతం అవుతుంటారు.ఆ మచ్చలను నివారించడానికి తేనె అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకోసం ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల తేనె, వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ( Cinnamon powder)వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్నచోట అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా చేస్తే మచ్చలు కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.
అలాగే కొందరికి యంగ్ ఏజ్ లోనే ముడతలు పడుతుంటాయి.అయితే వన్ టేబుల్ స్పూన్ తేనెకు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ) ను మిక్స్ చేసి చర్మంపై అప్లై చేసి స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే ముడతలు దెబ్బకు మాయం అవుతాయి.చర్మం యవ్వనంగా మారుతుంది.
మొటిమల నుంచి వేగంగా విముక్తి పొందాలంటే రెండు టేబుల్ స్పూన్ల తేనెలో వన్ టేబుల్ స్పూన్ జాజికాయ పొడి( Nutmeg powder)ని కలిపి నైట్ నిద్రించే ముందు మొటిమలపై అప్లై చేయండి.ఉదయాన్నే వాటర్ తో కడగండి.ఇలా చేస్తే మొటిమలు చాలా వేగంగా తగ్గుముఖం పడతాయి.
ఇక చర్మం గ్లోయింగ్ గా మరియు షైనీ గా మెరిసిపోవాలంటే వన్ టేబుల్ స్పూన్ తేనెకు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను మిక్స్ చేసుకోవాలి.ఈ మిత్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే చర్మం క్షణాల్లో కాంతివంతంగా మరియు సూపర్ షైనీ గా మెరుస్తుంది.