తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.
అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించే అర్హత కేసీఆర్ కు లేదని బండి సంజయ్ విమర్శించారు.ఈ నేపథ్యంలో దళిత సమాజానికి క్షమాపణ చెప్పాకే కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకోవాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ వ్యతిరేకం కాదని వెల్లడించారు.సచివాలయం పనులను పదే పదే పర్యవేక్షించిన కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం పనులను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు.