ప్రముఖ వ్యాపారవేత సుకేష్ చంద్రశేఖర్( Sukesh Chandrasekhar ) గురించి మనందరికీ తెలిసిందే.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు అయిన విషయం తెలిసిందే.ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సుకేష్ చంద్రశేఖర్ పేరు మారుమోగిపోయింది.అతనితో పాటు బాలీవుడ్ లో పలువురు బడా హీరోయిన్ల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.
కాగా ప్రస్తుతం అతడు ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
సుఖేష్ చంద్రశేఖర్ కేసు విషయంలో ఎక్కువగా వినిపించిన పేరు జాక్వెలిన్( Jacqueline ).ఈమె తన ప్రియుడు సుకేష్ నుంచి భారీ మొత్తంలో ఆస్తులను బహుమతులను పొందినట్లు ఈ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈస్టర్ పండుగ( Easter festival ) సందర్భంగా సుఖేష్ చంద్రశేఖర్ తన ప్రియురాలికి జైల్లో నుంచి లేఖ రాశాడు.
ఆ లేఖలో సుకేష్ ఈ విధంగా రాసుకొచ్చాడు.నా బేబీ.నా బొమ్మ జాక్వెలిన్.నీకు ఈస్టర్ శుభాకాంక్షలు.
ఇది నీకు ఎంతో ఇష్టమైన పండుగ.నీకు ఈస్టర్ ఎగ్స్ అంటే చాలా ఇష్టం.
నీకు తెలుసా? నువ్వు ఎంత అందంగా ఉంటావో.ఈ విశ్వంలో నీ అంత అందంగా ఇంకెవ్వరూ ఉండరు.
మనం ఇద్దరు ఎప్పుడు ఒక్కటే.తుమ్ మిలే, ఔర్ దిల్ కిలే, ఔర్ జీనేకో క్యా ఛాహియో అన్న పాట విన్న ప్రతీసారి నువ్వే గుర్తుకు వస్తావు.మనకు మంచి రోజులు రాబోతున్నాయని నేను నీకు హామీ ఇస్తున్నాను అని రాసుకొచ్చాడు.అయితే సుఖేష్ జైలు నుంచి ఇలా జాక్వెలిన్‌కు ప్రేమ లేఖలు రాయటం ఇదేం.
మొదటి సారి కాదు.మూడో సారి.
ఈస్టర్ సందర్భంగా తన ప్రియురాలితో పాటు తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలిపాడు.ఇకపోతే చంద్రశేఖర్ కేసు విషయంలో నోరా ఫతేహి పేరు కూడా కీలకంగా మారిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు సుకేష్ చంద్రశేఖర్ పై దాదాపుగా 30కి పైగా కేసులు నమోదు అయ్యాయి.