ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బలరాంపూర్ లో ట్రక్కు, కారు ఢీకొన్నాయి.
ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది.
కాగా ఈ ప్రమాదం శ్రీ దత్తగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డియోరియా మలుపు వద్ద చోటు చేసుకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించారు.