సోషల్ మీడియా( Social Media ) ద్వారా లక్ కలిసొస్తే ఓవర్ నైట్ లో సెలబ్రిటీలు అయ్యే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.యూట్యూబ్ వీడియోల ద్వారా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న వాళ్ల సంఖ్య తక్కువేం కాదు.
మహిళలు సైతం యూట్యూబ్ వీడియోలు( YouTube Videos ) చేస్తూ కోట్ల సంఖ్యలో సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుంటూ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు.కచ్చాబాదం సింగర్( Kacha Badam ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఈ సింగర్ పేరు భూబన్ బద్యాకర్( Bhuban Badyakar ) కాగా పల్లీలు అమ్ముతూ పాడే పాట ఇతనిని పాపులర్ చేసింది.సోషల్ మీడియాలో ఈ పాటకు ఏ రేంజ్ లో వ్యూస్ వచ్చాయో తెలిసిందే.సెలబ్రిటీలు( Celebrities ) సైతం ఈ పాటకు రీల్స్ చేసి రికార్డ్ స్థాయిలో వ్యూస్ పెంచారు.ఆ సాంగ్ వల్ల వచ్చిన పాపులారిటీ ఈ సింగర్ ను స్టార్ గా మార్చింది.
తను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఈ సింగర్ ఇతరులకు సహాయం చేయడం గమనార్హం.
తను సంపాదించిన డబ్బులు కరిగిపోవడంతో ఈ సింగర్ కు మళ్లీ పూర్వంలో ఎదుర్కొన్న పరిస్థితులే మళ్లీ ఎదురయ్యాయి.
ఒక కంపెనీ పత్రాలను చదవకుండా సంతకం చేయడంతో ఈ సింగర్ అప్ లోడ్ చేసిన ప్రతి వీడియోకు కాపీరైట్ సమస్య వస్తోంది.ప్రస్తుతం భూబన్ బద్యాకర్ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు.
ఈ సింగర్ కు బెంగాలీ సీరియల్( Bengali Serial )లో ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
తండ్రి పాత్ర షూటింగ్ లో పాల్గొన్న ఈ వ్యక్తికి 40,000 రూపాయల పారితోషికం దక్కింది.ఈ సీరియల్ సక్సెస్ సాధిస్తే మాత్రం భూబన్ బద్యాకర్ కు తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. భూబన్ బద్యాకర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సీరియల్స్ నిర్మాతలు ఈ సింగర్ కు మరిన్ని ఆఫర్లు ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.