సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి - ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరయ్యారు.

 Misinformation On Social Media Should Be Countered Choppadandi Mla Sunke Ravisha-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతున్నాయని అన్నారు.తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ గారిదనీ తెలిపారు.

సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలనీ బి ఆర్ ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందనీ ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించాలనీ సూచించారు.

నాడు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.ఇప్పుడు భారతదేశ అభివృద్ధి కోసం భారత రాష్ట్ర సమితి నీ కేసీఆర్ ఏర్పాటు చేశారనీ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పరిచారనీ,ఒకవైపు అభివృద్ధి మరొకవైపు సంక్షేమంతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భారతదేశంలో ముందుంచారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకలసత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనుకటి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీలు ,గ్రామ శాఖ కార్యదర్షులు,బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube