తమ ముఖ చర్మం తెల్లగా మెరిసిపోతూ కనిపించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.ఈ క్రమంలోనే ముఖాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్( Skin whitening cream ) లను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మాత్రం పది రోజుల్లోనే మీ ముఖ చర్మాన్ని తెల్లగా మారుస్తుంది.
ఇక ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్( Orange juice ), వన్ టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్( Tomato juice ) వేసుకోవాలి.చివరగా మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జ్యూస్ వేసుకుని అన్ని కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు ఏదైనా బ్రష్ సహాయంతో అప్లై చేసుకోవాలి.ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.కంప్లీట్ గా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఆపై ఏదైనా మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే కేవలం పది రోజుల్లోనే మీ ముఖ చర్మం తెల్లగా మారడం ప్రారంభమవుతుంది.రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.
కాబట్టి పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలని భావించేవారు ఈ రెమెడీని తప్పకుండా పాటించండి.

పైగా ఈ రెమెడీ చర్మం పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి ఎంతో బాగా సహాయపడుతుంది.అలాగే ప్రస్తుత వేసవి కాలంలో ఎండల దెబ్బకు చర్మం ట్యాన్ అయిపోయిందని తెగ బాధపడుతుంటారు.అలాంటి వారు కూడా ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు.
టమాటో, ఆరెంజ్, అలోవెరా మరియు ఆరెంజ్ పీల్ పౌడర్ లో ఉండే ప్రత్యేక సుగుణాలు ట్యాన్ అయిన చర్మాన్ని రిపేర్ చేయడానికి ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.