ఏపీ మంత్రివర్గంలో మార్పులు ప్రచారం మాత్రమేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.ఈనెల 7వ తేదీ నుంచి జగనన్న మా భవిష్యత్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతుందని తెలిపారు.
గెలిచే అవకాశాలు లేని వారికి టికెట్ ఇవ్వనని జగన్ చాలాసార్లు చెప్పారన్న అంబటి తనకూ గెలిచే అవకాశాలు లేకపోయినా టికెట్ ఇవ్వననే చెప్తారన్నారు.సత్తెనపల్లెలో కొందరి నేతల విషయం అధిష్టానమే చూసుకుంటుందని వెల్లడించారు.
అదేవిధంగా ముందస్తు ఎన్నికలు అనేది కూడా ప్రచారం మాత్రమేనని, అలాంటి అవసరం తమకు లేదని మంత్రి అంబటి స్పష్టం చేశారు







