తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రియమణి( Priyamani ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.
కేరళకు చెందిన బ్యూటీ అయిన కూడా అచ్చం తెలుగమ్మాయిల కనిపిస్తుంది.ఇక తన గ్లామర్ తో కూడా ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.
నటన పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ బాగా సందడి చేసింది.
ప్రియమణి తొలిసారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి 2003 లో ఎవరే అతగాడు సినిమాతో పరిచయం అయింది.అదే సమయంలో తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.
ఆ తర్వాత జగపతి బాబు నటించిన పెళ్లయిన కొత్తలో( Pellaina Kothalo ) సినిమాలో నటించి ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.అలా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో నటించింది.
కేవలం వెండితెరపైనే కాకుండా టాలీవుడ్ బుల్లితెరపై కూడా బాధ్యత వహిస్తుంది.ఈటీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షో ఢీ డాన్స్ షోలో( Dhee dance show ) జడ్జిగా కూడా చేసి బాగా సందడి చేసింది.
ఎవరైనా డాన్స్ పెర్ఫార్మెన్స్ నచ్చితే వెంటనే వాళ్లకు ముద్దుల వర్షం కురిపిస్తుంది.ఇక ఇప్పుడు ఆ షో కు దూరంగా ఉంటూ సోషల్ మీడియా( Social media ) ద్వారా అందరికీ టచ్ లో ఉంటుంది.

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంది.ఆ మధ్యనే వరుస సినిమాలలో సహాయక పాత్రలు చేసి మంచి గుర్తింపు అందుకుంది.ఇక ప్రియమణి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.అప్పుడప్పుడు తన సినిమా అప్డేట్ ల గురించి కూడా పంచుకుంటూ ఉంటుంది.

ఇక బాగా ఫోటోషూట్ లు కూడా చేయించుకుంటుంది.చాలావరకు ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది.ఏ రోజు కూడా ఆమె అందాలు బయటపెట్టే విధంగా షో చేయలేదు.కానీ ఈ మధ్య కాస్త అందాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఫోటోను స్టోరీ రూపంలో పంచుకుంది.అయితే అందులో తన ఫోటో చాలా బ్లర్ గా వచ్చింది.

దీంతో ఆ స్టోరీ చూసిన నెటిజన్స్ బాగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.నిజానికి ఈ మధ్య ప్రతి ఒక్క సెలబ్రిటీ బ్లర్ ఫోటో లను బాగా షేర్ చేసుకుంటున్నారు.దీంతో అందర్నీ ఉద్దేశించి ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది అంటూ.పంచుకునే ఫోటోలో కూడా క్లారిటీ లేకపోయింది అంటూ.ఫోటోలు చూసినా ఒకటే చూడకున్న ఒకటే అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం ప్రియమణి పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.
అంతేకాకుండా వెబ్ సిరీస్ లలో కూడా చేస్తుంది.