ఆర్ఆర్ఆర్ ( RRR ).ఈ పేరు తెలియని వరల్డ్ సినీ లవర్ లేరంటే అతియసోక్తి కాదేమో.
అంతగా మూవీ లవర్స్ కు ఇష్టమైన సినిమాగా నిలిచింది.స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan ), యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ( Rajamouli ) డైరెక్ట్ చేసాడు.
మన ఇండియన్ సినిమా గర్వించ దగ్గ సినిమాగా ”ఆర్ఆర్ఆర్” చరిత్రకెక్కింది.
ఈ సినిమా గత ఏడాది 2022, మార్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.
ప్రపంచ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది.హాలీవుడ్ లెవల్లో ఎందరో దర్శకులు సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యారు.
దీంతో పాటు హాలీవుడ్ లో వరుసగా పలు ప్రముఖ అవార్డులు అందుకుంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇక ఇటీవలే ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుని మరో సంచలనం క్రియేట్ చేసింది.ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీ సరిగ్గా ఇదే రోజు రిలీజ్ అయ్యింది.దీంతో ”రౌద్రం రణం రుధిరం” సినిమాకు ఈ రోజుతో ఏడాది పూర్తి అయ్యింది.
బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న సినిమా కోసం అంతా ఎదురు చూసారు.ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి సినిమా చేస్తున్న అని రాజమౌళి ప్రకటించి షాక్ ఇచ్చాడు.
ఇద్దరు స్టార్ హీరోలు కావడం ఏ ఒక్కరిని తగ్గించి చూపించినా ఫ్యాన్స్ ను తట్టుకోవడం కష్టం అని ముందు నుండి టాక్ వచ్చిన రాజమౌళి ఈ హీరోలను బ్యాలెన్స్ చేసిన తీరు అద్భుతం అనే చెప్పాలి.ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలనీ అనుకున్న కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చి గత ఏడాది మార్చి 25న రిలీజ్ అయ్యింది.అందుకే దీనిని చరిత్రలో ఒక హిస్టారికల్ డేట్ గా గుర్తు పెట్టుకున్నారు.మరి ఇలాంటి ఒక సినిమాను తెలుగు ఇండస్ట్రీ నుండి అందించిన టీమ్ అందరికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విషెష్ చెబుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
మరి మనం కూడా మన ఇండస్ట్రీ నుండి ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుందాం.