ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ను అన్ లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా..!

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ సిస్టంతో టోల్ వసూలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ప్రభుత్వం మరియు భాగస్వామ్య బ్యాంకుల అధికారం పొందిన అధికారిక ట్యాగ్ జారీదారులు ఈ ఫాస్ట్ ట్యాగ్ ను జారీ చేస్తారు.ఈ ఫాస్ట్ ట్యాగ్ పొందాలంటే కనీస రీఛార్జ్ రూ.100 అవుతుంది.వాహన రకం, ఫాస్ట్ ట్యాగ్ సేవకు ఖాతా లింక్ చేయబడి ఉంటుంది.వినియోగదారులకు డబ్బులు ఖాతాలోకి బదిలీ చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు ఏర్పడిన, ప్రక్రియ మాత్రం సులభతరంగా ఉంటుంది.

 Steps To Check Your Fastag Balance Online Details, Fastag Balance, Fastag, My Fa-TeluguStop.com

ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్న వాహనదారులు ఎక్కువగా ప్రయాణిస్తే వారికి బ్యాలెన్స్ పై ఒక అవగాహన ఉంటుంది.అలా కాకుండా ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేస్తే ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియదు.హైవే లపై ప్రయాణించేటప్పుడు, ఒకవేళ రద్దీగా ఉంటే బ్యాలెన్స్ తెలుసుకోవడం కాస్త కష్టం.అటువంటి సందర్భాల్లో సులభమైన మార్గాల్లో ఫాస్ట్ ట్యాగ్ ఐడిని క్రియేట్ చేసి బ్యాంక్ వెబ్సైట్ సందర్శించి, ఆన్లైన్ ద్వారా సింపుల్గా ఫాస్ట్ ట్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

ఆన్లైన్లో లాగిన్ అయిన తర్వాత వ్యూ ఫస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ కనపడుతుంది.

దానిపై జస్ట్ ఒక క్లిక్ తో ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ క్షణాల్లో తెలిసిపోతుంది.యాప్ స్టోర్ లో అందుబాటులో ఉన్న మై పాస్ట్ ట్యాగ్ యాప్ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు సంబంధించిన వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.లేదంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి 8884333331 నెంబర్ కు మిస్డ్ కాల్ అలర్ట్ ఫెసిలిటీ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

ఇక ఫాస్ట్ ట్యాగ్ లో రీఛార్జ్ చేసుకోవాలంటే బ్యాంక్ అధికారక వెబ్సైట్, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా ఆన్లైన్లో సులువుగా ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube