ఆ హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం ప్రేమలో ఉన్నారా.. ఫోటోలపై చెప్పాలంటూ?

ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేయడం ద్వారా కిరణ్ అబ్బవరం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.కిరణ్ అబ్బవరం గత సినిమా వినరో భాగ్యము విష్ణుకథ గత నెలలో థియేటర్లలో విడుదలై హిట్ గా నిలిచింది.

 Kiran Abbavaram And Rahasya Gorak Fall Love In Kashmir Details Here Goes Viral ,-TeluguStop.com

వచ్చే నెల 7వ తేదీన మీటర్ సినిమాతో ఈ హీరో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.అయితే ఈ సినిమాకు పోటీగా పలు క్రేజీ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో మీటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

అయితే కిరణ్ అబ్బవరం ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫోటోల వల్ల ఈ ప్రచారం జరుగుతుండగా ఈ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఇటీవల కిరణ్ అబ్బవరం కశ్మీర్ ట్రిప్ కు వెళ్లగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.అయితే అవే లొకేషన్లలో హీరోయిన్ రహస్య గోరక్ కూడా ఫోటోలను షేర్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

వైరల్ అవుతున్న వార్తల గురించి కిరణ్ అబ్బవరం ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.రాజావారు రాణివారు సినిమాతో ఈ హీరో, హీరోయిన్ కెరీర్ మొదలైంది.ఆ సినిమా సక్సెస్ సాధించడంతో కిరణ్ అబ్బవరం కెరీర్ పుంజుకున్నా రహస్య కెరీర్ మాత్రం పుంజుకోలేదు.కిరణ్ అబ్బవరం పారితోషికం 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.

నిర్మాతలకు మాత్రం కిరణ్ అబ్బవరం సినిమాల వల్ల కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తున్నాయని సమాచారం అందుతోంది.కిరణ్ రహస్య మధ్య చాలా కాలం నుంచి స్నేహం ఉండగా ఆ స్నేహం ప్రేమగా మారిందో లేదో తెలియాలంటే మాత్రం కిరణ్ అబ్బవరం స్పందించే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube