ప్రముఖ నాన్-ఫైనాన్షియల్ బ్యాంకింగ్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గోల్డ్ లోన్స్ అందించే ఈ బ్యాంకు రీసెంట్‌గా తన నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) సేవలను దేశీయ, ఎన్నారై కస్టమర్లకు విస్తరించింది.
కంపెనీ ఎన్‌పీఎస్ సర్వీసులను ఆఫర్ చేయడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా అధికారం పొందింది.వీటిని 2012 నుంచి అందిస్తోంది.
కాగా ఇప్పుడు దాని వెబ్‌సైట్, iMuthoot యాప్ వంటి మెరుగైన డిజిటల్ సౌకర్యాలతో తన వినియోగదారులకు అదనపు సేవలను అందించాలని ముత్తూట్ యోచిస్తోంది.
లాంగ్ టర్మ్ రిటైర్‌మెంట్ ప్లానింగ్ కోసం సబ్-సెక్షన్ 80 CCD (1B) కింద రూ.50,000 వరకు పన్ను రాయితీ కల్పించాలని కూడా ఈ నాన్-బ్యాంకింగ్ కంపెనీ ముందడుగులు వేస్తోంది.అంతేకాదు, దాని iMuthoot అప్లికేషన్ కస్టమర్లకు ‘డూ ఇట్ యువర్ సెల్ఫ్ మోడల్‘ని ఆఫర్ చేస్తోంది.
తద్వారా కస్టమర్లు త్వరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి స్వయంగా NPS రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయవచ్చు.ముత్తూట్‌కు భారతదేశం అంతటా 5,800 బ్రాంచ్‌లు ఉన్నాయి.దీనివల్ల కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు.
ముత్తూట్ ఫైనాన్స్ తన కస్టమర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి టెక్నాలజీ ద్వారా వైవిధ్యభరితమైన ఆర్థిక సంస్థగా అవతరించడానికి కమిట్ అయింది.ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ మాట్లాడుతూ, తాము పదవీ విరమణ ప్రణాళిక ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నామని, కస్టమర్‌ల పదవీ విరమణ తర్వాత సంవత్సరాలలో NPS సురక్షితమైన స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇకపోతే NPS కాకుండా, ముత్తూట్ ఫైనాన్స్ తన ప్లాట్‌ఫామ్‌లో బీమా, బంగారు నాణేలు, మ్యూచువల్ ఫండ్‌లతో సహా అనేక పెట్టుబడి ఆప్షన్స్‌ను అందిస్తోంది.