రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా లో ఉన్న విషయం తెలిసిందే.ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్ళాడు.
నాటు నాటు ప్రచారంలో భాగంగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన హాలీవుడ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా పేర్కొన్నాడు.ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాల్లో కూడా నటించాలని ఒక నటుడిగా కోరుకుంటున్నానని.
అందుకే వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటానని రామ్ చరణ్ పేర్కొన్నాడు.ప్రస్తుతం మొదటి హాలీవుడ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ప్రకటించిన రామ్ చరణ్ త్వరలోనే అధికారికంగా ప్రాజెక్ట్ ని ప్రకటించబోతున్నట్లుగా కూడా తెలియజేశాడు.
సౌత్ స్టార్ హీరోలు అది కూడా తెలుగు స్టార్ హీరోలు హాలీవుడ్ ప్రాజెక్టులు చేయడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
ఒకరిద్దరికీ మాత్రమే ఆ అవకాశం దక్కింది, అలాంటిది రామ్ చరణ్ కి హాలీవుడ్ సినిమా లో నటించే అవకాశం దక్కడం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో రామ్ చరణ్ చేయబోతున్న హాలీవుడ్ సినిమా గురించి తెగ చర్చించుకుంటూ ఊహల్లో విహరిస్తున్నారు.హాలీవుడ్ లో ముందు ముందు రామ్ చరణ్ పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి రామ్ చరణ్ హాలీవుడ్ సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ ఇప్పటి నుండే సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మెగా అభిమానులు సందడి మొదలైంది.ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీని ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.2025 సంవత్సరం వరకు రామ్ చరణ్ హాలీవుడ్ సినిమా వస్తుందేమో చూడాలి.