వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులు జగన్ కు షాక్ ఇవ్వనున్నారా ? జగన్ ప్రభుత్వాన్ని ఉద్యోగులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? అసలు ఉద్యోగులకు జగన్ సర్కార్ కు మద్య క్లాష్ ఎక్కడోచ్చింది ? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.గత ఎన్నికల టైమ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు రాబట్టుకునేందుకు వైఎస్ జగన్ ఉద్యోగులకు భారీగా వారాలు కురిపించారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని, మెరుగైన పీఆర్సీ అంధిస్తామని.జగన్ హామీ ఇచ్చారు.
దాంతో వైఎస్ జగన్ కాన్ఫిడెన్స్ మెచ్చి పెద్దఎత్తున ఉద్యోగులు వైసీపీకి మద్దతు తెలిపారు.

దాంతో గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి ఉద్యోగులు కూడా ఒక కారణం అని విశ్లేషకుల అభిప్రాయం.తీర అధికారం చేపట్టిన తరువాత ఉద్యోగుల కొరకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది జగన్ సర్కార్.ఎన్నోమార్లు ఇచ్చిన హామీలు నెరవేర్చలని.
ఉద్యోగులు డిమాండ్ చేసినప్పటికీ వైసీపీ సర్కార్ మాత్రం చూసి చూడనట్లుగా వదిలేసింది.దాంతో ఆందోళనల బాట పట్టారు ఉద్యోగులు.
అయితే పలు మార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.సిపిఎస్ రద్దు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో.
అలాంటప్పుడు ఎందుకు హామీ ఇచ్చారని వైసీపీని నిలదీస్తున్నాయి ఉద్యోగ సంఘాలు.

ప్రస్తుతం జర్కర్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఉద్యోగ సంఘాలు సిద్దమై నిరసనలు చేపడుతున్నారు.ఎన్నికల టైమ్ లో ఇచ్చిన హామీలను కాఛితంగా నెరవేర్చలని డిమాండ్ చేస్తున్నారు.దాంతో జగన్ సర్కార్ ఇరుకున పడేలా కనిపిస్తోంది.
ఈ ఉద్యమం ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఉద్యోగుల ఎఫెక్ట్ గట్టిగానే పడే అవకాశం ఉంది.మరి ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఉద్యోగుల విషయంలో వైఎస్ జగన్ వైఖరి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ సిపిఎస్ రద్దు, పీఆర్సీ వంటివి అమలు చేస్తే ఉద్యోగుల మద్దతు లభించే అవకాశం ఉంది.అలా కానీ పక్షంలో గత ఎన్నికల్లో అండగా నిలిచిన ఉద్యోగులు.
ఈసారి తిరగబడతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మరి జగన్ సర్కార్ ఏం చొస్తుందో చూడాలి.