1.తెలంగాణపై చంద్రబాబు కామెంట్స్
తెలంగాణలో ప్రతి ఒక్కరూ టిడిపిని గుండెల్లో పెట్టుకున్నారని, ప్రస్తుతం తెలంగాణకు సంపద వస్తుందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ నే అంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.
2.ఇతర పార్టీల నేతలు టచ్ లో ఉన్నారు : టీటీడీపీ
తెలంగాణ టిడిపిలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.
3.లోకేష్ పై రోజా కామెంట్స్
లోకేష్ పాదయాత్ర పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్లు ఉందని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.
4.జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.
జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
5.రెండో రోజు బైరెడ్డి పాదయాత్ర
రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రెండోరోజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు నేడు కొసిగి నుంచి ఆయన పాదయాత్ర మొదలైంది.
6.ఏపీకి ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ ప్రకటన
ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీకి తాము ఎప్పటికీ కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రకటించింది.
7.మహారాష్ట్రలో ఎంఐఎం అధినేత
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర తానే జిల్లాలోని ముంబర సబర్సన్ ప్రాంతంలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు.
8.టి20 లకు ప్రత్యేక హోదా నియమించండి
మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ టీం ఇండియా యాజమాన్యానికి కీలక సూచన చేశాడు.జట్టు తడబడకుండా ఉండాలంటే t20 లకు ప్రత్యేక కోచ్ ను నియమించాలని సూచించారు.
9.మల్లన్న సేవలు సిజేఐ దంపతులు
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
10.నేను భగత్ సింగ్ ను అనుసరిస్తా : మనీష్ సిసోడియా
సిబిఐ విచారణకు ముందు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనిషి ట్వీట్ చేశారు.తాను భగత్ సింగ్ ను అనుసరిస్తానని, దేనికి భయపడేది లేదని ఆయన ప్రకటించారు.
11.భార్యా బాధితుల నిరాహార దీక్ష
గృహహింస చట్టాలను సవరించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని భారీ బాధితులు బెంగళూరులో నిరాహార దీక్ష చేపట్టారు.
12.2024 ఎన్నికల్లో వార్ వన్ సైడ్
2024 ఎన్నికల్లో కూడా వారు వన్ సైడ్ గా ఉంటుందని , గ్రాడ్యుయేట్ , టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలుస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
13.వందే భారత్ ఎక్స్ప్రెస్ పై రాళ్ల దాడి
వందే భారత్ ఎక్స్ప్రెస్ పై మరోసారి రాళ్ల దాడి జరిగింది.మైసూరు చెన్నై మధ్య నడిచే రైలుపై కొంతమంది దుండగుల దాడితో అద్దాలు పగిలాయి.
14.జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఫై రోజా కామెంట్స్
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి స్పందించారు.ఇది చంద్రబాబు పార్టీ కాదు ఎన్టీఆర్ పార్టీ , జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీ బతకదని రోజా అన్నారు.
15.‘అప్సర్ భద్ర ‘ తో ఏపీ, తెలంగాణకు అన్యాయం
కర్ణాటకలో అప్సర్ భద్ర డాం నిర్మాణాన్ని ఆపకపోతే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులదే బాధ్యతని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
16.ఏపీ విద్యా విధానంపై ప్రశంసలు
ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు విద్యా వ్యవస్థ పై స్విజర్లాండ్ మాజీ అధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిన్ ప్రశంసలు కురిపించారు.
17.జగన్ పై కన్నా విమర్శలు
బిజెపి నుంచి టీడీపీ చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జగన్ పై విమర్శలు చేశారు.వైఎస్సార్ పేరును జగన్ చెడగొడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
18.ఢిల్లీ లిక్కర్ స్కాం
ఢిల్లీ లిక్కర్స్ స్కాం పై విచారణ పేరుతో ఈరోజు తనను అరెస్ట్ చేయబోతున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు.
19.గన్నవరం నుంచి షిరిడికి విమాన సర్వీసులు
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం షిరిడి కి మార్చి 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,500
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 56,180
.