నల్లగొండ జిల్లా: నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామానికి చెందిన పర్వతం శంకర్ (24)అనే యువ కౌలు రైతు రామన్నపేటలో భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తూ జీవిస్తున్నాడు.భూమి కౌలుకు,పంటల సాగుకు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాడు.
కాలం కలిసిరాక పంటలో సరైన దిగుబడి లేక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో తీరే మార్గం కనిపించలేదు.
దీనితో కలత చెందిన సదరు యువ కౌలు రైతు బుధవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతనిని హుటాహుటిన నల్లగొండ గొల్లగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు.మృతునికి భార్య మరియు ఒక కుమారుడు వున్నారు.
నిరుపేద కుటుంబం పెద్దదిక్కు కోల్పోవడంతో భార్య,కుమారుడు దిక్కులేనివారయ్యారు.