ఏపీలో వైఎస్ వివేకా హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.గత ఎన్నికల ముందు 2019 మార్చి 19 వ తేదీన మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగింది.
అయితే హత్య జరిగి నాలుకెళ్లు పూర్తి కావొస్తున్న ఇప్పటివరకు నిందితులు ఎవరనేది మిస్టరీగానే ఉంది.ఈ కేసును ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు చేస్తుండగా ఎప్పటికప్పుడు కీలక విషయాలు బయటపడుతున్నాయి.
ఈ హత్యకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి మరియు అతని తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.గత నెల 28 న అవినాష్ రెడ్డిని మొదటిసారి విచారించగా.
మరింత సమాచారం కోసం సెక్షన్ 160 కింద మరోసారి తాజాగా విచారించింది సిబిఐ.
ఇక అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా నిన్న ( 23న ) సిబిఐ విచారించాల్సి ఉంది.అయితే ఇతరత్రా కారణాల వల్ల సిబిఐ విచారణకు బాస్కర్ రెడ్డి హాజరు కాలేదు.ఇదిలా ఉంచితే సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి రెండవసారి హాజరు కావడంతో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం అని టీడీపీ వర్గంలోని కొందరి అభిప్రాయం.ఇక వివేకా హత్యకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.” వివేకా హత్య జగనే చేయించి ఆ నేరాన్ని.అప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాపై మోపాలని చూశారని ” చంద్రబాబు చెప్పుకొచ్చారు.అయితే టెక్నాలజీ పెరిగిన నేటి రోజుల్లో సులువుగా దొరికిపోతనని జగన్ అప్పుడు ఊహించి ఉండరని.
అబ్బాయి కిల్డ్ బాబాయ్ అంటూ జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు ఆరోపించారు.హత్య జరిగిన తరువాత మొదటగా జగన్ కు పోన్ వెళ్ళిన తరువాతే గుదే పోటుగా నాటకం ఆడారని ఇదంగా జగన్ స్కెచ్ అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా మొదటి సారి గత నెల 28న అవినాష్ రెడ్డిని కాల్ డేటా ఆధారంగా విచారించిన సిబిఐ పలు కీలక విషయాలను బయట పెట్టింది.వివేకా హత్య జరగడానికి ముందు, తర్వాత అవినాష్ రెడ్డి రెండు నెంబర్లతో కాల్ మాట్లాడినట్లు అప్పటి విచారణలో బయట పడింది.జగన్ తో మాట్లాడేందుకు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి, మరియు జగన్ సతీమణి భారతిరెడ్డితో మాట్లాడేందుకు ఆమె వ్యక్తిగత సిబ్బంది నవిన్ నెంబర్లకు కాల్ చేసినట్లు అప్పటి సిబిఐ విచారణలో తేలింది.దాంతో చంద్రబాబు అన్నట్లుగా జగన్ సలహాతోనే అవినాష్ రెడ్డి వివేకాను హత్య చేయించారా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.మొత్తానికి వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు వేగంగా జరుగుతుండడంతో ఫైనల్ గా సిబిఐ ఎలాంటి సంచలన విషయాలు బయటపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.