బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హిందీతోపాటు దేశం మొత్తం మీద ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.తెలుగులో మహేష్ బాబు సరసన మరియు రామ్ చరణ్ సరసన కూడా నటించి తెలుగువారి హృదయాలను కొల్లగొట్టింది.
ఫుగ్లి సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన కియారా నేటికి అనేక సినిమాలతో బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది.కబీర్ సింగ్, గుడ్ న్యూజ్, లస్ట్ స్టోరీస్ వంటి సినిమాలతో పాపులర్ హీరోయిన్ గా కియారా ఎదిగింది.
ఇక ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న కియారా సిద్ధార్థ్ కన్నా ముందే కొంత మందితో ప్రేమాయణం సాగించింది.మరి ఆమె సాగించిన రిలేషన్షిప్స్ విషయంపై వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
మోహిత్ మోర్వ
పుగ్లి సినిమాలో తనతో పాటే నటించిన మోహిత్ తో కియారా అద్వానీ కొన్నాళ్ళ పాటు డేటింగ్ చేసింది.ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డ వీరిద్దరూ రెండేళ్లపాటు వెయిటింగ్ చేశారు కానీ ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు.
ముస్తఫా బర్మావాలా
అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం లో వచ్చిన మెషీన్ సినిమాలో ముస్తఫా మరియు కియారా అద్వానీ కలిసి నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరిపై అనేక వార్తలు పుట్టుకొచ్చాయి.ఒక ఏడాది పాటు వీరి వ్యవహారం బాగానే సాగిన ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ బ్రేకప్ చేసుకున్నారు.
వరుణ్ ధావన్
వరుణ్ ధావన్ మరియు కియారా అద్వానీ కలంక్ సినిమాలో కలిసి నటించారు.ఈ సినిమా సమయంలోనే డేటింగ్ మొదలుపెట్టారు ఈ జంట.తరచుగా మీడియా కంట పడిన ఈ జంట అనేక ఈవెంట్ లలో కలిసి పాటిస్పేట్ చేశారు.అయితే కియారా మరియు వరుణ్ వారి రిలేషన్షిప్ పై వస్తున్న వార్తలను ఖండించేవారు తాము మంచి స్నేహితులం అంటూ కూడా చెప్పుకునేవారు.
సిద్ధార్థ్ మల్హోత్రా
షేర్షా సినిమా సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా తో కియారా అద్వానీ ప్రేమలో పడినట్టుగా అనేక వార్తలు వచ్చాయి ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజు నుంచి ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్నారు.ఈ సినిమా విజయవంతం అయినట్టుగానే ఈ జంట కూడా జీవితంలో విజయవంతంగా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.