బాలయ్య త్యాగాన్ని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్.. దండం పెట్టాలంటూ?

నమ్మిన వాళ్లకు ఏ చిన్న కష్టం వచ్చినా అండగా నిలిచే విషయంలొ ముందువరసలో ఉండే హీరోగా బాలయ్యకు పేరుంది.తారకరత్న విషయంలో బాలయ్య స్పెషల్ కేర్ తీసుకున్న సంగతి తెలిసిందే.

నాలుగు రోజుల పాటు ఆస్పత్రికే పరిమితమై తారకరత్న కోలుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో బాలయ్య అన్ని ప్రయత్నాలు చేశారు.అయితే తారకరత్న ఇంకా స్పృహలోకి రాలేదనే సంగతి తెలిసిందే.

తారకరత్న స్పృహలోకి ఎప్పుడు వస్తారో తెలియాలని ఫ్యాన్స్ కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా బాలయ్య తన సినిమా షూటింగ్ కు కూడా ఈ నెలాఖరు వరకు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది.తారకరత్న కోసం పూర్తి సమయం కేటాయించాలనే ఆలోచనతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

బాలయ్య తీసుకున్న నిర్ణయాన్ని ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.

Telugu Akhanda, Balakrishna, Fans, Tarakaratna, Tollywood-Movie

సినిమాల కంటే బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోలు అరుదుగా ఉంటారని ఈ విషయంలో బాలయ్యకు దండం పెట్టాలని అభిమానులు భావిస్తారు.సాధారణంగా బాలయ్య నిర్మాతలకు నష్టం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అయితే తారకరత్న విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదని బాలయ్య ఆలోచన అని సమాచారం.

Telugu Akhanda, Balakrishna, Fans, Tarakaratna, Tollywood-Movie

బాలయ్య టాలెంట్ వేరే లెవెల్ కాగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాలయ్య తర్వాత సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి.యాడ్స్ లో నటించడానికి కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.బాలకృష్ణ సినిమాలు హిందీలో కూడా విడుదలై సక్సెస్ సాధిస్తే బాగుంటుందని కొంతమంది భావిస్తుండటం గమనార్హం.స్టార్ హీరో బాలయ్య నవ్యత ఉన్న కథాంశాలను ఎంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube