లోకేష్ పాదయాత్ర కు ముందుగానే బాబు ఈ కీలక నిర్ణయం ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.ఏపీ అంతట పాదయాత్ర నిర్వహించి జనాల్లో తన పలుకు పెంచుకునేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు.

 This Key Decision Of Babu Before Lokesh Padayatra ,nara Lokesh, Tdp, Chandrababu-TeluguStop.com

మరికొన్ని రోజుల్లోనే చిత్తూరు జిల్లా నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది.దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, రూట్ మ్యాప్ సిద్ధం అయ్యాయి.

ఈ యాత్రను సక్సెస్ చేసేందుకు చంద్రబాబు సైతం అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు.పాదయాత్ర మొదలైన తరువాత నుంచి అది ముగిసే వరకు మధ్యలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ మేరకు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను బాబు అలెర్ట్ చేశారు.ఇక పాదయాత్ర ప్రారంభం కంటే ముందుగానే లోకేష్ పర్యటించబోయే నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టుబోతున్నారట.

Telugu Chandrababu, Janasena, Lokesh, Robin Sharma, Ysrcp, Yuvagalam-Politics

ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో టిడిపి అభ్యర్థులను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట.పాదయాత్ర కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా,  ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు ఉత్సాహంగా ఉంటారని , పాదయాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు వారే చూసుకుంటారని, జన సమీకరణకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడమని బాబు ఆలోచిస్తున్నారట.టిడిపి రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ బాబుకు ఈ విషయాన్ని చెప్పారట.దీంతో చంద్రబాబు ముందుగానే కొంతమంది అభ్యర్థుల ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారట.కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ఇబ్బందికరంగా మారడంతో, టికెట్ ఇవ్వాలనుకున్న వారిని పిలిపించి నియోజకవర్గాల్లో చురుగ్గా పనులు చేసుకోవాలని సూచిస్తున్నారట.ఇక దాదాపు 100కు పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోందట.

Telugu Chandrababu, Janasena, Lokesh, Robin Sharma, Ysrcp, Yuvagalam-Politics

ఇప్పటికే 150 నియోజకవర్గాలకు పైగా చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు.ఇప్పటికే సర్వేలు చేయించడంతో దానికి అనుగుణంగా వారి పేర్లను ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.అయితే జనసేనతో పొత్తు కుదిరే అవకాశం ఉండడంతో, ఆ పార్టీ ఆశిస్తున్న స్థానాల విషయంలో బాబు అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో పెట్టే అవకాశం కనిపిస్తోంది.జనసేనకు పెద్దగా పట్టు లేని నియోజకవర్గం లో టిడిపి అభ్యర్థులను బాబు ఖరారు చేయబోతున్నారట.

పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాలపై బాబుకు క్లారిటీ ఉండడంతో, ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను  లోకేష్ పాదయాత్ర కంటే ముందుగానే ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube