మీరు చూస్తున్న పిక్చర్ లో హీరో సిద్ధార్థ్ పక్కన కూర్చున్న నటుడిని గుర్తు పట్టారా ? అతడు మరెవరో కాదు.తమిళ హీరో కార్తి.
తమిళం నుంచి వచ్చి తెలుగు లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో కార్తి కూడా ఒకరు.ఆయన నటించే ప్రతి సినిమా తెలుగు లో విడుదల అవుతూనే ఉంటుంది.తన అన్న సూర్య పాపులారిటి తో మొదట ఎంట్రీ ఈజీ అయినప్పటికి ఆ తర్వాత తన ప్రతిభ తోనే ఒక ఫ్యాన్ బేస్ ఎరపరుచుకున్నాడు.2007 లో హీరో గా మారిన కార్తి ఇప్పటి వరకు 23 సినిమాల వరకు నటించాడు.తీసే ప్రతి చిత్రంలో ఒక విభిన్నమైన కథ, కథనం ఉండాలి అని కోరుకునే హీరోల్లో కార్తి కూడా ఉంటాడు.
అలాగే సినిమాలో హీరోయిజం మాత్రమే చూపించాలని అనుకోకుండా కథను మాత్రమే నమ్ముకొని సినిమాలు చేయడం కార్తికి బాగా అలవాటు.కార్తి నటించిన సినిమాలను చూస్తే ఖచ్చితంగా మంచి టేస్ట్ ఉన్న హీరో అని చెప్తారు.ఇక కార్తి తీసిన అనేక చిత్రాలకు సీక్వెల్స్ ఉండాలి అని అయన అభిమానులు కోరుకుంటున్నారు.
తెలుగు లో మొదటి సారి యుగానికి ఒక్కడు చిత్రం తోనే వచ్చాడు.ఆ చిత్రానికి ఇప్పటికి అయినా సీక్వెల్ చేస్తే బాగుండు అని చాల మంది అనుకుంటున్నారు.
ఇక ఖైదీ అనే చిత్రం కూడా కార్తి ని నటుడిగా మరొక మెట్టు ఎక్కించింది.ఈ సినిమా చుసిన తర్వాత చాల మంది సినిమా ఇలా కూడా తీస్తారా అని ఫీల్ అయ్యారు.మేకప్ ఖర్చు లేకుండా, నాచురల్ గా, ఒక్క రాత్రిలో ఏమైనా జరగొచ్చు అనే విధంగా చాలా బాగా చూపించారు
చాల మందికి తెలియని విషయం ఏమిటి అంటే కార్తి మొట్ట మొదట ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా నటించాడు.మణి రత్నం దర్శకత్వం లో 2004 లో వచ్చిన యువ సినిమా లో హీరో సిద్ధార్థ్ కి స్నేహితుడి పాత్రలో కనిపిస్తాడు.ఆ టైం లో కార్తి కాస్త లావుగా కనిపించాడు కూడా.అలా జూనియర్ ఆర్టిస్ట్ గా తొలిసారి నటించి మరో మూడేళ్లకు హీరో గా మారాడు.కార్తి నటించి, చివరగా విడుదల అయినా సర్దార్ సినిమా పాజిటివ్ రివ్యూస్ ని దక్కించుకుంది.ఇక ఈ ఏడాది పొన్నియన్ సెల్వం సీక్వెల్ తో పాటు జపాన్ అనే మరొక సినిమా చేయనున్నాడు.
ఈ రెండు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయ్.