సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కమెడియన్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే లేడీ కమెడియన్ గా ఎంతో గుర్తింపు పొందిన వారిలో నటి కోవై సరళ ఒకరు.తెరపై హాస్యం పండించాలంటే ఈమె తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.
ఈమె నటించిన సినిమాలు కనుక చూస్తే ఎంతటి బాధలో ఉన్న వారు కూడా తమ పెదాలపై చిరునవ్వును చిందిస్తారు.ఇలా అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కోవై సరళ ఇప్పటికీ ఆడపాదనప సినిమాలలో నటిస్తున్నారు.
ఇక కోవే సరళ బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా ఉంటుంది.ఇలా తెలుగు తమిళ మలయాళ భాషలలో సుమారు 700కు పైగా సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను నవ్వించిన కోవే సరళ వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయ్యారు.
ఇలా వృత్తిపరమైన జీవితంలో సక్సెస్ సాధించిన ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి.తన కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకున్నటువంటి ఈమె తన జీవితం గురించి ఆలోచించడమే మర్చిపోయారు.
ఇంటికి కోవే సరళ పెద్దది కావడంతో తన తోబుట్టువుల బాధ్యతలను ఈమె తీసుకొని వారిని చదివించి వారికి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించింది.ప్రస్తుతం తన తోబుట్టువులు అందరూ కూడా ఇతర దేశాలలో స్థిరపడ్డారు.అయితే ఈమె వారి కోసం పెళ్లి కూడా చేసుకోకుండా కుటుంబాన్ని ముందుకు నడిపించడం కోసం వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని సినిమాలలో నటించారు.ఇలా ఈమె తన కుటుంబం కోసం తన జీవితాన్నే ధారబోసింది.
అయితే ప్రస్తుతం ఈమెకు వయసు పైబడి అవకాశాలు తగ్గడంతో తనని పలకరించే వారు కూడా లేరు.ఎవరికైతే ఈమె తన జీవితాన్ని త్యాగం చేసిందో వాళ్లు కూడా తనని పట్టించుకోవడం లేదట.
ఇలా వెండితెరపై నవ్వుతూ అందరినీ నవ్వించిన కోవే సరళ నిజ జీవితంలో మాత్రం చాలా విషాదం చోటు చేసుకుందనీ చెప్పాలి.