తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలో విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఇద్దరు అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ.సినిమాలలో నటించాలంటే వయసుతో సంబంధం లేదని అది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని తెలిపింది.అలాగే సోషల్ మీడియాలో నటీనటుల వయసు గురించి ఎన్నో రకాల వార్తలు రాస్తుంటారని కానీ ఏ వయసులో ఉండే అందం ఆ వయసులో ఉంటుంది అని చెప్పుకొచ్చింది.తాను చేసే పాత్రలపై మాత్రమే దృష్టి పెడతానని ఇంకా ఏ విషయాల గురించి ఆలోచించను అని ఆమె తెలిపింది.
ప్రేక్షకులు ఎవరైనా నటీనటులు బాగా చేయాలని కోరుకుంటారు.నేను చేసిన కొన్ని పాత్రలు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నేను ప్రతి సినిమాకు మెరుగవుతూ వచ్చాను.
ప్రతి సినిమా నుంచి నేను ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను.నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను ఎవరూ మెచ్చుకోలేదు.
ప్రస్తుతం నాకు సినిమాలపై ఉన్న తపన అందరికీ అర్థమయింది.ఇప్పుడు అందరూ నా గురించి నా నటన గురించి మాట్లాడుకుంటున్నారు.నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది శృతిహాసన్.ఇకపోతే కమలహాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతోంది.శృతిహాసన్ ప్రస్తుతం శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.పెద్ద కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు.