తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మకు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ఉండేది.ఈయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుతున్నాయి.
ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం ఎన్నో వివాదాలలో నిలుస్తున్నారు.ఈ మధ్యకాలంలో అమ్మాయిలతో కలిసి చేసే బోల్డ్ ఇంటర్వ్యూల ద్వారా ఈయన తరచూ వార్తలలో నిలుస్తున్నారు.
తాజాగా వర్మ ఆశు రెడ్డితో చేసిన ఇంటర్వ్యూ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే.ఈ ఇంటర్వ్యూ ద్వారా వర్మను విమర్శించే వారు సంఖ్య కూడా ఎక్కువ అయ్యింది.
ఇకపోతే తాజాగా వర్మ తల్లి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనీ తన కుమారుడు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా వర్మ తల్లి వర్మ గురించి మాట్లాడుతూ.
తాను జీఎస్‌టీ సినిమాను రాము పక్కన కూర్చుని చూశాను.తను ఇతరుల ఇష్టాలను ఎంతో గౌరవిస్తాడు.
తన వరకు వస్తే తనను తాను మార్చుకోకపోవడమే వర్మకు ఇష్టం.ఇక తను ఇంటికి రాగానే నేను కనిపించాలి.
వర్మ ఇంటికి వచ్చే సమయానికి నేను లేకపోతే తనకు ఏ మాత్రం నచ్చదు.ఇంటి రాగానే తనకు నేను కనబడితే తన కళ్ళల్లో మెరుపు కనపడుతుంది.ఇక ఏ విషయంలోనైనా తనకు నచ్చితేనే తన పని చేస్తాడు.ఇక తను మారాలి అనుకుంటేనే మారుతాడు కానీ లేకపోతే ఈ జన్మకు తాను మారుడని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ గురించి తన తల్లి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వర్మ గురించి చాలామంది ఎన్నో కామెంట్స్ చేసిన రాము గురించి నాకు తెలుసు.తన గురించి నాకు ఒక ఆలోచన ఉందంటూ తన గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.