రాజమౌళి సినిమాల్లో వచ్చిన బెస్ట్ పోలీస్ వీళ్ళే !

పోలీస్ అంటే ఇలాగే ఉండాలి అనే అనిపించేలా, గంభీరమైన ముఖం తో , రోషం తో కూడిన మీస కట్టుతో, బేస్ వాయిస్ తో మెస్మైరైసింగ్ నటనతో టాలీవుడ్ లో బెస్ట్ కాప్స్ గా అదరగొట్టిన వాళ్ళు చాలానే ఉన్నారు.నాటి సాయి కుమార్ నుంచి నేటి రామ్ చరణ్ వరకు పోలీస్ ఆఫీసర్ రోల్స్ కి న్యాయం చేసిన హీరోస్ కి కొదవేమి లేదు.

 Rajamouli Best Cops In His Movies Raviteja Ram Charan Details, Rajamouli Heroes,-TeluguStop.com

అయితే రాజమౌళి విషయానికి వస్తే అయన హీరోలు పోలీస్ ఆఫీసర్స్ గా నటిస్తే అందులో ఒక హీరోయిజం ఉంటుంది.పోలీస్ అంటే వీడేరా అని అనిపిస్తుంది.

కెరీర్ లో అతి తక్కవ సినిమాలే తీసిన నోటబుల్ మూవీస్ చేయడం లో ఆయనకు తెలుగు ఇండస్ట్రీ లో సాటి లేరు ఎవరు.ఇక కెరీర్ లో రెండు సార్లు మాత్రమే తన హీరోలకు పోలీస్ పాత్ర ఇచ్చాడు.

అందులో ఒకరు రవి తేజ. విక్రమ్ సింగ్ రాథోడ్ గా విక్రమార్కుడు సినిమాలో ప్రేక్షకుడు కూడా హీరోల ఫీల్ అయిపోయే విధంగా రొమ్ము విరగ దీసుకునేలా చేసాడు.రవి తేజ కెరీర్ లో కూడా ఈ సినిమా బెస్ట్ చిత్రం.

Telugu Rajamouli, Rajamouli Cops, Ram Charan, Raviteja, Vikramarkudu-Movie

రవి తేజ అనగానే ఎంతో ఎనర్జీతో నటిస్తాడు.కానీ ఒక పవర్ ఫుల్ పాత్ర కూడా చేయగలడు అని ఈ చిత్రం ద్వారానే తెలిసింది.ఇక రాజమౌళి మరొక పోలీస్ రామ్ చరణ్.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ భీం పాత్రలో నటించాడు.రామ్ చరణ్ ని ఇది వరకే మంచి పాత్రల్లో చూసిన ఇది మాత్రం చాల పవర్ ఫుల్ పాత్ర లాగ మారింది.

ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడి నటిస్తూ ఒక బాధ్యత గల పోలీస్ గా, తండ్రి ఆశయం నెరవేర్చే పాత్రలో అద్భుతంగా కనిపించాడు.

Telugu Rajamouli, Rajamouli Cops, Ram Charan, Raviteja, Vikramarkudu-Movie

ఇలా ఈ ఇద్దరు హీరోలు తెలుగు వారికి నిజమైన పోలీసులే.రాజమౌళి ఏ పాత్ర తీసుకున్న దాని కోసం చాల హోమ్ వర్క్, బ్యాగ్రౌండ్ వర్క్ చేసి ప్రేక్షకుల ముందు ప్రెసెంట్ చేసి మార్కులు వేయించుకోవడం లో దిట్ట.అలాగే యముడిగా తారక్ ని, యువరాణి కోసం మరో జన్మ ఎత్తే పాత్రలో రామ్ చరణ్ ని ఎంతో చక్కగా చూపించాడు.

ఆలా అని మిగతా సినిమాలను తక్కువ చేయడం కాదు.కానీ ఇవి ఒక అడుగు ముందుకు వేసి అందరి మనస్సులో స్థానం సంపాదించుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube