తెలంగాణ మంత్రి మండలి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది.
ఈ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.అదేవిధంగా కేంద్ర వైఖరిని ఎండగట్టేలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై వ్యవహార శైలిపై ప్రత్యేకంగా చర్చించే ఛాన్స్ ఉంది.రైతు బంధు, దళితబంధు అమలుపై కేబినెట్ సమీక్ష నిర్వహించనుంది.
రాష్ట్రంలో ఎన్నికలు రావడానికి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో నేటి కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.