భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0ను ప్రారంభించినట్లు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.సుప్రీంలో ఉన్న పెండింగ్ కేసులను ట్రాక్ చేసేందుకు ఈ యాప్ ను వినియోగించనున్నారు.న్యాయాధికారులు, ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
అదేవిధంగా నోడల్ అధికారులు ధర్మాసనంలో దాఖలు చేసిన కేసులు, స్టేటస్ ఆర్డర్ లు, తీర్పులు, దాఖలు చేసిన ఏవైనా ఇతర పత్రాలను యాప్ లోకి వెళ్లి పరిశీలించవచ్చని తెలిపారు.గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ 2.0 అందుబాటులోకి వస్తుందని, ఐఓఎస్ వినియోగదారుల కోసం వారం రోజుల్లో యాప్ ను అందుబాటులోకి తీసుకోస్తామని సీజేఐ వెల్లడించారు.